వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహాత్మా గాంధీ ముని మనవరాలికి సౌతాఫ్రికాలో 7 ఏళ్ల జైలు శిక్ష-వ్యాపారవేత్తను మోసం చేసిన ఆశిష్ లతా

|
Google Oneindia TeluguNews

సౌతాఫ్రికాలో ఉండే మహాత్మాగాంధీ ముని మనవరాలు ఆశిష్ లతా రామ్‌గోబిన్(56)కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. రూ.3 కోట్లు మోసంతో పాటు ఫోర్జరీకి పాల్పడిన కేసులో డర్బన్ కోర్టు ఆమెను దోషిగా తేల్చి శిక్ష విధించింది. ఆమె దోషిత్వాన్ని,శిక్షను అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కోర్టు తిరస్కరించింది. 2015 నుంచి నడుస్తున్న ఈ కేసులో డర్బన్ స్పెషలైజ్డ్ కమర్షియల్ క్రైమ్ కోర్టు సోమవారం(జూన్ 7) తీర్పు వెలువరించింది.

అసలేం జరిగింది...

అసలేం జరిగింది...

నేషనల్ ప్రాసిక్యూటింగ్ అథారిటీ(ఎన్‌పీఏ) ప్రకారం... వ్యాపారవేత్త ఎస్ఆర్ మహారాజ్‌ను ఆశిష్ లతా మోసం చేశారు. న్యూ ఆఫ్రికా అలయన్స్ ఫుట్‌వేర్ డిస్ట్రిబ్యూటర్స్‌ డైరెక్టర్ అయిన మహారాజ్‌ను ఆమె అగస్టు,2015లో కలిశారు. మహారాజ్ కంపెనీ ఫుట్‌వేర్‌తో పాటు దుస్తులు కూడా తయారుచేస్తుంది. ఇందుకు అవసరమైన ముడి సరుకును ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అలాగే ఇతర కంపెనీలకు లాభాల వాటా ప్రాతిపదికన ఆర్థిక సాయం కూడా చేస్తుంది.

రూ.3 కోట్లు పైచిలుకు రుణం...

రూ.3 కోట్లు పైచిలుకు రుణం...

ఈ నేపథ్యంలోనే ఆశిష్ లతా రామ్‌గోబిన్ మహారాజ్‌ను ఆశ్రయించి తనకు రూ.3 కోట్లు పైచిలుకు డబ్బు అవసరం ఉందని చెప్పారు. సౌతాఫ్రికా హాస్పిటల్ గ్రూప్ నెట్‌కేర్‌తో తన కంపెనీ ఒప్పందం కుదుర్చుకుందని... ఇండియా నుంచి ఆ కంపెనీ కోసం మూడు కంటైనర్ల ముడి సరుకును దిగుమతి చేయిస్తున్నానని చెప్పారు. అయితే ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందునా దిగుమతి సుంకం,ఖర్చులు భరించలేకపోతున్నానని చెప్పారు. తనకు ఆర్థిక సాయం చేస్తే లాభాల్లో వాటా ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు వ్యాపారవేత్త మహారాజ్ ఆమె కోరిన మొత్తాన్ని అందజేశారు.

తప్పుడు ధ్రువ పత్రాలతో మోసం...

తప్పుడు ధ్రువ పత్రాలతో మోసం...

కానీ ఆ తర్వాత కొద్దిరోజులకే ఎస్ఆర్ మహారాజ్‌కు అసలు విషయం తెలిసింది. అసలు నెట్‌కేర్ గ్రూపు ఆశిష్ లతాతో ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోలేదని తెలిసింది. తప్పుడు ధ్రువ పత్రాలతో ఆమె తనను మోసం చేసినట్లు గుర్తించారు. నెట్‌కేర్ పేరిట నకిలీ ధ్రువ పత్రాలు సృష్టించి తనను బురిడీ కొట్టించినట్లు గుర్తించారు. అంతేకాదు,అసలు ఇండియా నుంచి ఆమె ఎటువంటి గూడ్స్ దిగుమతి చేయలేదని తేలింది. దీంతో ఆశిష్ లతాపై మహారాజ్ డర్బన్ కోర్టును ఆశ్రయించడంతో మోసం,ఫోర్జరీ ఆరోపణల కింద ఆమెపై కేసులు నమోదయ్యాయి. తాజాగా డర్బన్ కోర్టు ఆమెను దోషిగా తేల్చి శిక్షను ఖరారు చేసింది.

Recommended Video

#TogetherWithLakshadweep : Lakshadweep కి Rahul Gandhi అండ | Save Lakshadweep || Oneindia Telugu
ఆశిష్ లతా తల్లి హక్కుల కార్యకర్త...

ఆశిష్ లతా తల్లి హక్కుల కార్యకర్త...

ఆశిష్ లతా మహారాజ్ ప్రముఖ హక్కుల కార్యకర్త ఈలా గాంధీ కుమార్తె. ప్రస్తుతం ఆమె నాన్ వయలెన్స్-ఎన్‌జీవో ఇంటర్నేషనల్ సెంటర్‌లోని ఒక విభాగానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. సామాజిక,రాజకీయ,వాతావరణ అంశాలపై ఆమె పనిచేస్తున్నారు. ఆశిష్ లతా తల్లి ఈలా గాంధీ ఆమె సేవలకు అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు పొందారు. అటు సౌతాఫ్రికాలో,ఇటు భారత్‌లో ఆమె సేవలకు తగిన గుర్తింపు,గౌరవం లభించాయి.

English summary
A 56-year-old great-granddaughter of Mahatma Gandhi, who was accused in a six-million rand fraud and forgery case, has been sentenced to seven years in jail by a Durban court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X