చైనా శిశువుల్లో సగానికి పైగా వాళ్లే!: ఆసక్తికర రిపోర్ట్..

Subscribe to Oneindia Telugu

బీజింగ్: వన్ చైల్డ్ పాలసీని రద్దు చేసిన తర్వాత చైనాలో శిశు జననాల రేటు పెరిగింది. మరీ ముఖ్యంగా రెండో సంతానం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది తొలి 8 నెలల్లో జన్మించిన శిశువుల్లో సగానికి పైగా రెండో సంతానంగా జన్మించినవారే కావడం విశేషం.

చైనా తాజా నివేదికలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ సంవత్సరం జనవరి-అగస్టు వ్యవధిలో కోటీ 16లక్షల మంది శిశువులు జన్మించారు. ఇందులో 52శాతం రెండో సంతానంగా జన్మించిన శిశువులే కావడం గమనార్హం. చైనా ఆరోగ్య, కుటుంబ నియంత్రణ కమిషన్ (ఎన్‌హెచ్‌ఎఫ్‌పీసీ) ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

Majority of Chinese newborns are second children: state media

40ఏళ్ల వన్ చైల్డ్ పాలసీని రద్దు చేసి.. రెండో సంతానానికి కూడా అనుమతినివ్వడంతో.. 2016లో 1.85కోట్ల మంది శిశువులు జన్మించారని పేర్కొంది. ఇందులో 45శాతం మంది రెండో సంతానమే కావడం గమనార్హం. రెండో సంతానానికి అనుమతినిచ్చిన తర్వాత ప్రసూతి ఆసుపత్రిల నిర్మాణం, నిర్వహణకు చైనా ప్రభుత్వం భారీగానే ఖర్చు చేస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Over half the babies born in China in the first eight months of 2017 were second children, official media reported on Tuesday after the relaxation of the longstanding one-child rule.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి