వంద రోజులు దాటినా..: ఎంహెచ్ 370పై షాకింగ్ 'బుక్'
కౌలాలంపూర్: మలేషియా విమానం ఎంహెచ్ 370 గల్లంతై వంద రోజులు దాటింది. అయినా దాని ఆచూకీపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. మలేషియా ప్రభుత్వం సోమవారం ఓ ప్రకటన చేసింది. గల్లంతైన ఎంహెచ్ 370 విమానం ఆచూకీ లభ్యమయ్యే వరకు తాము సెర్చ్ ఆపరేషన్ ఆపేది లేదని ప్రకటించింది.
మలేషియా విమానం గల్లంతై వంద రోజులకు వచ్చినా ఇంకా ఆచూకీ లభించక పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన మలేషియన్లకు, ప్రపంచానికి బాధాకరమైనదని మలేషియా రవాణా శాఖ మంత్రి హిషముద్దీన్ హుస్సేన్ అన్నారు. విమానం ఆచూకీ దొరికే వరకు తాము సెర్చ్ చేస్తామన్నారు.

ప్రమాదం కాదని..
మలేషియా విమానం ఎంహెచ్ 370 గల్లంతు కావడంపై ఓ పుస్తకం విడుదలవుతోంది. అందులో ఆసక్తి కలిగించే అంశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎంహెచ్ 370 విమానం గల్లంతు ఓ ప్రమాదం కాదని ఆ పుస్తకంలో రచయితలు అభిప్రాయపడ్డారని వార్తలు వస్తున్నాయి. ఈ పుస్తకం పేరు 'గుడ్ నైట్ మలేషియన్ 370 - ట్రూత్ బిహైండ్ ది లాస్ ఆఫ్ ఫ్లైట్ 370'.












Click it and Unblock the Notifications