వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ హెల్ప్‌కి మలేషియా, నాడు గర్ల్స్‌ని పిల్చిన పైలట్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

కౌలాలంపూర్: ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన మలేషియా ఎయిర్ లైన్స్ విమానం ఆచూకీ కనిపెట్టడంలో ఆ దేశ అధికారులు భారత్ సాయం కోరారు. మంగళవారం మలేషియా అధికారులు భారత్ ప్రభుత్వాన్ని సంప్రదించారని సమాచారం. భారత్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఇప్పటికే ఈ విమానం అన్వేషణలో పలు దేశాలు పాల్గొంటున్నాయి. సమాచారం లభించక పోవడంతో వియత్నాం తమ వెతుకులాటను తగ్గించనున్నట్లు చెప్పింది. ఐదు రోజులుగా వెతుకుతున్నప్పటికీ విమానం ఆచూకీ తెలియక పోవడంతో వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు.

విమానంతో చివరి కాంటాక్ట్ విషయంలో పరస్పరం విరుద్ధమైన వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో గందరగోళం ఏర్పడుతోంది. కాగా, విమానంలో గల ప్రయాణీకుల ఫోన్లు రింగ్ అవుతున్నాయని సమాచారం. విమానంలో గల ప్రయాణీకుల కుటుంబ సభ్యులు పలువురు అధికారులకు ఈ విషయాన్ని చెప్పారు. ఫోన్స్ రింగ్ అవుతుండటంతో వాటి ఆధారంగా కూడా సెర్చ్ చేస్తున్నారు. మరోవైపు మిస్ అయిన విమానం పైలట్ పైన ఆరోపణలు వస్తున్నాయి.

విమానం

విమానం

నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన మలేసియా ఎయిర్‌లైన్స్ విమానం జాడ ఇంకా తెలియరాలేదు. విమానం అదృశ్యంపై జరుగుతున్న అంతర్జాతీయ దర్యాప్తులో భాగంగా దొంగిలించిన పాస్‌పోర్టులతో ఈ విమానం ఎక్కిన ఇద్దరు వ్యక్తుల గురించి అధికారులు థాయిలాండ్‌లోని బీచ్ రిసార్ట్ పట్టయాలోని ట్రావెల్ ఏజంట్లను సోమవారం ప్రశ్నించారు.

మలేషియా విమానం

మలేషియా విమానం

ఇదిలా ఉండగా, ఈ విమానం చివరిసారిగా మలక్కా జలసంధిపై పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ కనిపించినట్లు మలేసియా సైనిక అధికారి ఒకరు చెప్పారు. విమానం కోసం 34 విమానాలు, నలభై నౌకలతో జరుపుతున్న గాలింపు యత్నాలను విమానం అదృశ్యమైన చోటునుంచి 100 నాటికల్ మైళ్ల (115 మైళ్ల) పరిధికి విస్తరించారు.

జాడ తెలియని విమానం

జాడ తెలియని విమానం

ఈ విమానంలో ప్రయాణించడం కోసం టికెట్లు కొన్న అయిదుగురు ప్రయాణికులు విమానం ఎక్కలేదని, వారి లగేజిని విమానంలోంచి దించేయడం జరిగిందని అధికారులు చెప్పారు. దీనిపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు మలేసియా రవాణా మంత్రి హిషమ్ముద్దీన్ హుస్సేన్ చెప్పారు.

మలేషియా

మలేషియా

ప్రయాణికుల్లో ఇద్దరు థాయిలాండ్‌లో దొంగిలించిన పాస్‌పోర్టులతో ప్రయాణిస్తున్నారని, యూరప్ వెళ్లేందుకు టికెట్లు వారి వద్ద ఉన్నట్లు తెలిసింది. నేరగాళ్లు, అక్రమంగా వలసలు వెళ్లే వాళ్లు ఇలా తరచూ దొంగిలించిన పాస్‌పోర్టులపై ప్రయాణిస్తూ ఉంటారు. ఈ ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన బయోమెట్రిక్ సమాచారం, సిసిటీవీ దృశ్యాలను దర్యాప్తులో సహకరిస్తున్న చైనా, అమెరికా ఇంటెలిజన్స్ ఏజన్సీలకు అందజేసినట్లు హిషమ్ముద్దీన్ చెప్పారు.

ఎందుకు కనుగొనలేకపోతున్నారు?

ఎందుకు కనుగొనలేకపోతున్నారు?

ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ ప్రకారం ఈ విమానాన్ని ఎప్పటికైనా కనిపెట్టే అవకాశం ఉందని ఏవియేషన్ నిపుణులు అంటున్నారు. జెట్ విమానాల యుగం ప్రారంభమైన 1958 నుంచి ఇప్పటిదాకా కేవలం వేళ్ల మీద లెక్కపెట్టదగ్గ విమానాలు మాత్రమే అస్సలు ఆచూకీ లేకుండా పోయాయని యూఎస్ ఎయిర్‌వేస్‌కు చెందిన వైమానిక రంగ నిపుణుడు కెప్టెన్ జాన్ ఎం కాక్స్ వివరించారు. ఏటీసీతో సంబంధాలు తెగిపోయాక కూడా ఈ విమానం కొద్దిసేపటిదాకా ఎగురుతూనే ఉందని కచ్చితంగా చెప్పగలనని.. ఆ తర్వాత ఏం జరిగిందో మాత్రం చెప్పలేమని ఆయన పేర్కొన్నారు.

పైలట్ జాయ్ ఫుల్ వ్యక్యా!?

పైలట్ జాయ్ ఫుల్ వ్యక్యా!?

ఆస్ట్రేలియా నైన్ టివి ఛానల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జోన్టీ రూస్ అనే మహిళ... ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పారు. డిసెంబర్ 2011న తనను, తన స్నేహితురాలిని ప్రస్తుత మిస్సింగ్ విమానం పైలట్ కాక్ పిట్‌లోకి ఆహ్వానించారని చెప్పారు.

పైలట్ జాయ్ ఫుల్ వ్యక్యా!?

పైలట్ జాయ్ ఫుల్ వ్యక్యా!?

ఆస్ట్రేలియా నైన్ టివి ఛానల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జోన్టీ రూస్ అనే టీనేజ్ యువతి... ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పారు. డిసెంబర్ 2011న తనను, తన స్నేహితురాలిని ప్రస్తుత మిస్సింగ్ విమానం పైలట్ కాక్ పిట్‌లోకి ఆహ్వానించారని చెప్పారు. అందుకు ఆ ఇద్దరు అమ్మాయిలు అంగీకరించారు.

పైలట్ జాయ్ ఫుల్ వ్యక్యా!?

పైలట్ జాయ్ ఫుల్ వ్యక్యా!?

ఆస్ట్రేలియా నైన్ టివి ఛానల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జోన్టీ రూస్ అనే టీనేజ్ యువతి... ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పారు. డిసెంబర్ 2011న తనను, తన స్నేహితురాలిని ప్రస్తుత మిస్సింగ్ విమానం పైలట్ కాక్ పిట్‌లోకి ఆహ్వానించారని చెప్పారు. అందుకు ఆ ఇద్దరు అమ్మాయిలు అంగీకరించారు. సదరు టీవి ఛానల్ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా చూపించింది.

పైలట్ జాయ్ ఫుల్ వ్యక్యా!?

పైలట్ జాయ్ ఫుల్ వ్యక్యా!?

ఆస్ట్రేలియా నైన్ టివి ఛానల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జోన్టీ రూస్ అనే టీనేజ్ యువతి... ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పారు. డిసెంబర్ 2011న తనను, తన స్నేహితురాలిని ప్రస్తుత మిస్సింగ్ విమానం పైలట్ కాక్ పిట్‌లోకి ఆహ్వానించారని చెప్పారు. అందుకు ఆ ఇద్దరు అమ్మాయిలు అంగీకరించారు. సదరు టీవి ఛానల్ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా చూపించింది.

పైలట్ జాయ్ ఫుల్ వ్యక్యా!?

పైలట్ జాయ్ ఫుల్ వ్యక్యా!?

2011 డిసెంబర్ నెలలో సదరు పైలట్ తమను కాక్ పిట్‌లోకి ఆహ్వానించారన్న ఆరోపణలపై మలేషియా ఎయిర్ లైన్స్ స్పందించింది. ఈ ఆరోపణలతో తాము షాక్‌కు గురయ్యామని తెలిపింది.

పైలట్ జాయ్ ఫుల్ వ్యక్యా!?

పైలట్ జాయ్ ఫుల్ వ్యక్యా!?

2011 డిసెంబర్ నెలలో సదరు పైలట్ తమను కాక్ పిట్‌లోకి ఆహ్వానించారన్న ఆరోపణలపై మలేషియా ఎయిర్ లైన్స్ స్పందించింది. ఈ ఆరోపణలతో తాము షాక్‌కు గురయ్యామని తెలిపింది.

English summary
The missing Malaysian Airline that went missing over the Strait of Malacca mostly had Chinese passengers. Out of the 227 passengers and the 12 crew members, 38 were Malaysians, 7 Indonesians, 6 Australians, 5 Indians, 4 French and 3 Americans. Rest were Chinese.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X