వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమర్జెన్సీలో మాల్దీవులు: చీఫ్ జస్టిస్ అరెస్ట్, కొనసాగుతున్న ఉద్రిక్తత

|
Google Oneindia TeluguNews

మాలే: మాల్దీవుల్లో సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా, అత్యవసర పరిస్థితి విధించిన నేపథ్యంలో ఏకంగా దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తినే అరెస్ట్‌ చేశారు. అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ సోమవారం మాల్దీవుల్లో 15 రోజుల పాటు అత్యయిక స్థితి ప్రకటించిన విషయం తెలిసిందే.

కాగా, మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున భద్రతాబలగాలు సుప్రీంకోర్టుకు చేరుకుని ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్లా సయీద్‌తో పాటు మరో న్యాయమూర్తిని అరెస్ట్‌ చేశారు.
రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, అనర్హత వేటుకు గురైన విపక్ష ఎంపీల సభ్యత్వాలను పునరుద్ధరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు అధ్యక్షుడు యమీన్‌ ససేమిరా అంటుండంతో మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం నెలకొంది.

ప్రధాన న్యాయమూర్తితోపాటు సొంత సోదరుడిని కూడా

ప్రధాన న్యాయమూర్తితోపాటు సొంత సోదరుడిని కూడా

ప్రధాన ప్రతిపక్షానికి మద్దతిస్తున్న తన సోదరుడిని, మాజీ అధ్యక్షుడు మౌమూన్‌ అబ్దుల్‌ గేయూమ్‌ను కూడా అరెస్ట్‌ చేయాలని యమీన్‌ ఆదేశించారు. 80ఏళ్ల గేయూమ్‌ అక్కడ ప్రజాస్వామ్య ఎన్నికలకు ముందు దాదాపు 30ఏళ్ల పాటు దేశాధ్యక్షుడిగా పనిచేశారు. అర్థరాత్రి సమయంలో ఆయనను అరెస్ట్‌ చేశారు. కాగా, అవినీతికి పాల్పడిన కేసులో ఇద్దరు న్యాయమూర్తులపై విచారణ జరుపుతున్నామని, కోర్టకు సంబంధించి ప్రధాన పరిపాలనాధికారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

అంత పెద్ద తప్పేం చేయలేదు

అంత పెద్ద తప్పేం చేయలేదు

తాను అరెస్ట్‌ చేసే తప్పు ఏమీ చేయలేదని గేయూమ్‌ వీడియో సందేశాన్ని సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేశారు. కాగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అరెస్ట్‌లు‌ చేయకూడదని, యమీన్‌పై అవిశ్వాసం పెట్టే ప్రయత్నాలను అడ్డుకోవాలని.. పోలీసులను, భద్రతా బలగాలను ప్రభుత్వం ఆదేశించింది. కోర్టు కూడా చట్టం కంటే ఎక్కువ కాదని పేర్కొంది.

 సుప్రీంకోర్టు హద్దు మీరిందంటూ..

సుప్రీంకోర్టు హద్దు మీరిందంటూ..

కాగా, సుప్రీంకోర్టు హద్దు మీరిందని, అధికారాలను అతిక్రమించిందని యమీన్‌ ఆరోపిస్తున్నారు. తొమ్మిది మంది యమీన్‌ రాజకీయ వ్యతిరేకులను జైళ్ల నుంచి విడుదల చేయాలని, యమీన్‌ పార్టీ నుంచి ఫిరాయించినందుకు వేటు పడ్డ 12 మంది పార్లమెంటు సభ్యుల సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని గురువారం సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో పార్లమెంటులో విపక్షానికి మెజార్టీ పెరుగుతుంది. యమీన్‌ను పదవి నుంచి దింపేసే అధికారం లభిస్తుంది.

 మరింత ఉద్రిక్తంగా మాల్దీవులు

మరింత ఉద్రిక్తంగా మాల్దీవులు

ఈ నేపథ్యంలోనే యమీన్‌ సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడానికి అంగీకరించడం లేదు. ఈ విషయంపై అంతర్జాతీయ ఒత్తిడికి కూడా తలొగ్గలేదు. అంతేగాకుండా యమీన్‌ తన పదవిని కాపాడుకునేందుకు పార్లమెంటును కూడా నిరవధికంగా వాయిదా వేయడం గమనార్హం. దీనిపై విపక్షాలు ఉద్యమిస్తున్నా.. ఆయన లెక్కచేయడం లేదు. తాజాగా ప్రధాన న్యాయమూర్తిని అరెస్ట్‌ చేయడంతో దేశంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చెలరేగుతున్నాయి.

English summary
The crisis in Maldives has deepened with the Chief Justice being arrested.
Read in English: Maldives crisis deepens
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X