వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

UN General Assembly అధ్యక్షుడిగా మాల్దీవులు విదేశాంగ మంత్రి అబ్దుల్ షాహిద్ ఎన్నిక, భారత్ మద్దతుతో

|
Google Oneindia TeluguNews

ప్రపంచ దేశాల అతిపెద్ద కూటమి ఐక్యరాజ్యసమితిలో సాదారణ అసెంబ్లీకి 76వ అధ్యక్షుడిగా అబ్దుల్ షాహిద్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం మాల్దీవులు విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న ఆయన.. నాలుగింట మూడొంతుల ఓట్లతో విజయంసాధించారు. ఏటా జరిగే యూఎన్ జనరల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిసారి ఒక్కో ప్రాంతానికి అవకాశం కల్పిస్తుంటారు. ఈసారి ఆసియా-పసిఫిక్ గ్రూప్ దేశాలకు అవకాశం దక్కగా, మాల్దీవులు దేశం తమ అభ్యర్థిగా అబ్దుల్ షాహిద్ ను ముందుంచగా, భారత్ సహా పలు దేశాలు ఆయనకు మద్దతుగా నిలిచాయి.

యూఎన్ జనరల్ అసెంబ్లీ 76వ అధ్యక్షుడి కోసం జరిగిన ఎన్నికలో అబ్దుల్ షాహిద్ కు మద్దతుగా 143ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థిఅయిన అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రి జాల్మియా రసూల్ కు కేవలం 48 ఓట్లు మాత్రమే దక్కాయి. ఐక్యరాజ్యసమితో ఉన్నత పదవిగా భావించే అసెంబ్లీ అధ్యక్ష సీటు మాల్దీదులకు దక్కడం ఇదే మొదటిసారి.

maldives-foreign-minister-abdulla-shahid-elected-president-of-un-general-assembly-india-congratulat

ఐరాస సాధారణ అసెంబ్లీ అధ్యక్ష పదవికి అబ్దుల్ షాహిద్ పేరును మాల్దీవులు ప్రభుత్వం ప్రకటించడానికి ముందే భారత్ తన మద్దతును తెలిపింది. భారత విదేశాంగా శాఖ కార్యదర్శి హర్ష్ శ్రింఘాల్ 2020 నవంబర్ లో మాల్దీవులు పర్యటనకు వెళ్లిన సందర్భంలోనే ఆ దేశ ప్రయత్నాలకు భారత్ బాసటగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. అన్నట్లుగానే ఇవాళ్టి ఎన్నికలో భారత్.. అబ్దుల్ షాహిద్ కు ఓటేసింది. ఆయన విజయం తర్వాత..

మాల్దీవులు విదేశాంగ మంత్రి అబ్దుల్ షాహిద్ ఐరాస అసెంబ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా హార్థిక శుభాకాంక్షలు చెబుతున్నానంటూ భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యవనికపై నిలబడిన మాల్దీవులుకు ఇది తన సొంత స్థాయికి నిదర్శనని, బహుళత్వం, ఐరాసాలో సంస్కరణలకు అబ్దుల్ ఎన్నిక దోహదం చేస్తాయని ఆశిస్తున్నట్లు జైశంకర్ ట్వీట్లు చేశారు.

English summary
Foreign minister of the Maldives Abdulla Shahid was elected as the President of the 76th United Nations General Assembly with an overwhelming three-fourth majority, with143 in favour, 48 against and no abstentions and no invalid votes. This is a post held on an annual basis, rotated amongst various regional groupings. The 76th session (2021-22) is the turn of the Asia-Pacific group. This is the first time that the Maldives will be occupying the office of the President of the UN General Assembly. Union external affairs minister S Jaishankar on Monday took to Twitter to congratulate Shahid on his selection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X