దేశద్రోహం కేసు: మాల్దీవుల ఉపాధ్యక్షుడు అరెస్ట్
న్యూఢిల్లీ: మాల్దీవుల ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. చైనా పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న అహ్మద్‌ను విమానాశ్రయంలో పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ప్రస్తుతం అతన్ని జైలులో ఉంచారు.
మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో అహ్మద్ అదీబ్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. సెప్టెంబర్ 28న మాల్దీవుల అధ్యక్షుడు యమీన్ అబ్దుల్ గయూమ్ ప్రయాణిస్తున్న బోట్‌లో బాంబు పేలుడు సంభవించింది.
ఈ ఘటనలో ఆ దేశ అధ్యక్షుడు గయూమ్ సురక్షితంగా బయటపడగా ఆయన భార్య, భద్రతా సిబ్బంది గాయపడ్డారు. సౌదీ అరేబియాలోని హజ్ యాత్ర ముగించుకుని మాలేకి స్పీడ్ బోట్‌లో తిరిగి వస్తుండగా ఈ పేలుడు సంభవించింది.
ఈ ఘటనతో ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్‌కు సంబంధం ఉందనే ఆరోపణలతో కేసు నమోదైంది. ఈ క్రమంలో ఆ దేశ ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
#BREAKING: Maldives Vice President Ahmed Adeeb arrested over plot to assassinate president (AFP file pic) pic.twitter.com/z8JVFXEr3U
— China Xinhua News (@XHNews) October 24, 2015 Maldives VP Ahmed Adeeb arrested over alleged plot to assassinate president https://t.co/6MZdguLi9S pic.twitter.com/jhXdDNifn2
— Hindustan Times (@htTweets) October 24, 2015 











Click it and Unblock the Notifications