ప్రియురాలిని చంపి.. శవంతో సెల్ఫీ తీసుకున్నాడు

నన్నింగ్: చైనాలోని నన్నింగ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనను ప్రేమించిన యువతిని దారుణంగా హత్య చేసి ఆమె శవంతో సెల్ఫీ తీసుకున్నాడు ఓ దుర్మార్గుడు. అంతేగాక, ఆ సెల్ఫీని తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్ట్ చేసి పైశాచికాన్ని చాటుకున్నాడు. అతడు చేసిన పోస్ట్ పై నలువైపుల నుంచి విమర్శలు రావడంతోపాటు అతడ్ని కటకటాల వెనక్కి నెట్టింది.

వివరాల్లోకి వెళితే.. చైనాలోని నన్నింగ్ పట్టణంలో నిందితుడు కిన్(25) నివాసముంటున్నాడు. ఆ దుర్మార్గుడిలో ఏం నచ్చిందోగానీ లిన్ అనే అమ్మాయి వాడి ప్రేమలో పడిపోయింది. కొంతకాలంగా ఇద్దరూ కబుర్లు, షికార్లతో గడపసాగారు. అయితే ప్రతిదానిలో తనదే పైచేయి అన్నట్లుగా వ్యవహరించేవాడు కిన్.

Man arrested after killing his girlfriend then posting a selfie of him with her dead body on social media

సరే, ప్రేమిస్తే అన్ని సర్దుకుపోవాల్సిందేనని ఊరకుండిపోయింది లిన్. ఆ క్షమాగుణమే ఆమె ప్రాణాలు పోగొట్టుకునేలా చేస్తుందని ఊహించలేదు లిన్. మూడు రోజుల కిందట ఈ ప్రేమికులిద్దరూ గొడవపడ్డారు. తప్పు కిన్ దే అయినా లిన్‌తో ఘర్షణకు దిగాడు.

ఉన్మాదంతో ఊగిపోయిన కిన్.. పదునైన ఆయుధంతో లిన్‌పై దాడిచేసి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని అందంగా ముస్తాబుచేసి, పక్కనే పడుకుని సెల్ఫీ తీసి, నెట్‌లో పోస్ట్ చేశాడు.

అంతేగాక, తన పోస్టుపై ‘ఫర్గివ్ మి ఫర్ మై సెల్ఫీష్ లైఫ్(నా స్వార్థపు ప్రేమను క్షమించు)' అని రాశాడు. దీంతో యావత్ ప్రపంచం ఆ ఫొటోను చూసి ఆ ప్రేమోన్మాదిని చీదరించుకుంది.ఆ ఉన్మాది పోస్ట్‌పై సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితుడు కిన్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+