లాటరీలో రూ. కోట్లు: భార్యకు విడాకులిచ్చాడు
బీజింగ్: లాటరీ సొమ్ము వచ్చిందని భార్యకు విడాకులు ఇచ్చిన వింత సంఘటన చైనాలో జరిగింది. అయితే విడాకులు ఇచ్చిన అతనిని మొదటి భార్య లాటరీ సొమ్ము కోసం వెంటాడింది. ముక్కు పిండి లాటరీలో వచ్చిన సొమ్ములో చట్టపరంగా వాటా తీసుకుంది.
ఈ దెబ్బతో భార్యకు విడాకులు ఇచ్చిన వ్యక్తికి చుక్కలు కనపడ్డాయి. చైనాలోని చాంగ్ కింగ్ నగరంలో లియు జియాంగ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య ఉంది. అయితే వేరే మహిళతో ఇతనికి వివాహేతర సంబంధం ఉంది.
ఇతను ఒక లాటరీ టిక్కెట్టు కొనుగోలు చేశాడు. అంతే అతనిని అదృష్టలక్ష్మి వరించింది. లాటరీలో అతనికి 4.6 మిలియన్ యువాన్లు ( భారత్ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 4.7 కోట్లు) వచ్చింది. ఫిబ్రవరి 26వ తేదిన అతను లాటరీ సొమ్ము అందుకున్నాడు.

అతను తరువాత రోజు (ఫిబ్రవరి 27వ తేది) భార్యకు విడాకులు ఇచ్చాడు. అయితే విడాకులు ఇవ్వక ముందే లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశాడు, సొమ్ము వచ్చిన తరువాత విడాకులు ఇచ్చాడని, తనకు అందులో వాటా ఇప్పించాలని లియు జియాంగ్ భార్య కోర్టును ఆశ్రయించింది.
కోర్టులో విచారణ జరిగింది. విడాకులు ఇవ్వడానికి ముందే లాటరీ టిక్కెట్ తీసుకున్నందున భార్యకు 1.15 మిలియన్ యవాన్లు ఇవ్వాలని ఇటివల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండవ భార్యతో జల్సా చెయ్యడానికి సిద్దంగా ఉన్న లియు జియాంగ్ కు చుక్కలు కనపడ్డాయి. కోర్టు ఆదేశాలను పాటించి మొదటి భార్యకు సొమ్ము చెల్లించాడు.












Click it and Unblock the Notifications