వాట్సప్‌లో అసభ్య సందేశం: రూ. 43లక్షల జరిమానా
దుబాయ్: సహోద్యోగికి వాట్స్‌ప్‌లో అసభ్య సందేశం పంపిన ఓ వ్యక్తి 43 లక్షల జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఇంటర్‌నెట్ వినియోగదారుల నియంత్రణకు దుబాబ్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించింది.

దీనిని పరిగణనలోకి తీసుకోకుండా దిగువ కోర్టులు స్వల్పమొత్తంలో.. రూ.1.8 లక్షల జరిమానాతో సరిపుచ్చాయి. అయితే ఫెడరల్ సుప్రీంకోర్టు(ఎఫ్ఎస్‌సి) ఈ కొత్త చట్టాన్ని వెలుగులోకి తీసుకొస్తూ.. జరిమానా మొత్తాన్ని రూ.43 లక్షలకు పెంచింది.
పాత చట్టాన్ని ఇకపై అమలు చేయరాదని, కొత్త చట్టం నిర్ధేశించిన శిక్షలను, జరిమానాలను పాటించాలని ఎఫ్ఎస్‌సి ఆదేశించింది. నిందితుడు తన సహోద్యోగికి బెదిరింపులతో కూడిన అసభ్య సందేశం పంపించాడని నిర్ధారణ కావడంతో కోర్టు భారీ జరిమానా విధించింది.












Click it and Unblock the Notifications