రక్తపు మడుగులో తల్లి, ఎవరో అనుకొని పట్టించుకోకుండా వెళ్లిన కొడుకు

బీజింగ్: ఓ వ్యక్తి తన తల్లిని చూసేందుకు వేగంగా వెళ్తుండగా, రోడ్డు పైన రక్తపు మడుగులో ఓ మహిళ పడి ఉండటాన్ని గుర్తించాడు. కానీ తల్లిని చూసేందుకు అతను దానిని పట్టించుకోకుండా వెళ్లాడు. కానీ ఇంటికి వెళ్లాక అసలు విషయం అర్థమైంది.. రక్తపు మడుగులో పడి ఉంది తన తల్లి అని.

ఝాంగ్ (సర్ నేమ్) అనే వ్యక్తి అన్హూయ్ ఈస్టర్న్ ప్రావిన్స్‌లో ఉంటున్నాడు. అతను తన తల్లిని చూసేందుకు కారులో వేగంగా వెళ్తున్నాడు. ఆ సమయంలో రోడ్డు పైన ఓ మహిళ ప్రాణాపాయ స్థితిలో పడి ఉంది. దానిని అతను పట్టించుకోలేదు.

Man ignores dying hit-and-run victim - later finds out it is his mother

అతను ఇంటికి వెళ్లాక అసలు విషయం తెలిసిందే. ఇంటికి వెళ్లేసరికి అక్కడ తల్లి లేదు. అంతేకాదు, రక్తపు మడుగులో పడి ఉన్న ఆ వ్యక్తి తన తల్లేనని తెలుసుకున్నాడు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నాడు.

అతను అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. అంబులెన్స్ వచ్చింది. అయితే, ఆసుపత్రికి తరలించే మార్గంలో ఆమె కన్నుమూశారు. తన కారుకు డ్యాష్ బోర్డు రికార్డ్ లేదని, అందుకే తాను కారు ఆపలేకపోయానని ఆ వ్యక్తి కన్నీరు మున్నీరు అయ్యాడు. సదరు మహిళ ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+