రోజూ నైట్ షిఫ్ట్ వేస్తున్నారని 10 మందిని హత్య.. మరో 27 మందిని కూడా !

అసలు మనిషేనా ??? ఇప్పుడు చెప్పబోయే విషయం చదివిన తర్వాత సదరు వ్యక్తి గురించి ఇదే అనిపించకుండా ఉండదు. పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి పలు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి కానీ ఈ వ్యక్తి మాత్రం అత్యంత దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. రోజూ నైట్ షిఫ్ట్ వేస్తున్నారనే కారణంతో పని తగ్గించుకునేందుకు దారుణానికి ఒడిగట్టాడు. 10 మందిని హత్య చేయడమే కాకుండా మరో 27 మందిని కూడా చంపేందుకు ప్లాన్ చేయడం సర్వత్రా కలకలం రేపుతోంది. ఈ షాకింగ్ ఘటన జర్మనీలో చోటు చేసుకోగా ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

అసలేం జరిగిందంటే..?

నిందితుడు 2007లో నర్సింగ్ శిక్షణ పూర్తి చేసుకుని, 2020లో పశ్చిమ జర్మనీలోని వుర్సెలెన్ పట్టణంలోని ఒక ఆసుపత్రిలో మేల్‌ నర్స్‌ గా చేరాడు. అయితే అతనికి నిత్యం రాత్రి షిఫ్ట్‌లలో పనిచేసేవాడు. తన పనిభారపు ఒత్తిడిని తగ్గించుకునేందుకు అతను తన పర్యవేక్షణలో ఉన్న వృద్ధ రోగులకు మార్ఫిన్ లేదా మత్తుమందులను ఇంజెక్ట్ చేసినట్లు తేలింది. ఈ కారణంగానే 10 మంది చనిపోవడంతో ఆలస్యంగా ఈ ఘాతుకం వెలుగులోకి వచ్చింది. ఈ హత్యలు 2023 డిసెంబర్ నుండి 2024 మే మధ్య చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

man-killed-10-members-and-try-to-kill-27-members-for-daily-night-shifts-issue

ఈ ఘటనపై విచారణ చేపట్టగా.. రాత్రిపూట షిఫ్టులలో ఉన్నప్పుడు, రోగుల మరణాలను వేగవంతం చేయడానికి మరియు తన పనిభారాన్ని తగ్గించుకోవడానికి బాధితులకు అధిక మోతాదులో మార్ఫిన్, మిడాజోలం అనే మత్తు మందులను తేలింది. 10 మంది రోగులను హత్య చేసి, మరో 27 మందిని చంపడానికి ప్రయత్నించినట్టు గుర్తించారు. నేరం రుజువు కావడంతో అతను దోషిగా నిర్ధారించి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది.

అంతే కాకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న నర్సు సంరక్షణ అవసరమయ్యే రోగుల పట్ల ఎలాంటి సానుభూతి చూపలేదని ప్రాసిక్యూటర్లు కోర్టుకు వివరించారు. బాధితుల జీవితాలపై తానే యజమానిగా వ్యవహరించాడని ఆరోపించారు. అంతే కాకుండా అతను చేసిన నేరాలు ఇప్పటివరకు గుర్తించిన వాటి కంటే ఎక్కువగా ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు మరిన్ని మృతదేహాలను వెలికితీసి పరీక్షలకు పంపించనున్నట్టు సమాచారం.

మరోవైపు అధిక పని పని ఒత్తిడి వ్యక్తులలో ఆందోళనను పెంచుతుందని.. అది తీవ్రమైతే మానసిక రుగ్మతలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడికి గురైన వారు తమ మనసుపై నియంత్రణ కోల్పోయి, విపరీతమైన పరిణామాలకు కారణమయ్యే అవకాశముందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+