మానవ మృగం .. హతమార్చి గుండెను, బంగాళాదుంపలతో కలిపి కూర వండి పెట్టి , మరో ముగ్గురిపై పైశాచిక దాడి
అతను మనిషి కాదు మానవ మృగం. అత్యంత కర్కశంగా పక్కింటి వారిని చంపడమే కాకుండా, పక్కింట్లో ఉండే మహిళను హతమార్చిన తరువాత ఆ మహిళ గుండెను వండి అతను చంపబోయే మిగతా బాధితులకు తినిపించిన కిరాతకుడు. అత్యంత హేయమైన, ఒళ్ళు గగుర్పొడిచేలా క్రూరమైన హత్యలకు పాల్పడిన ఓ వ్యక్తి చేసిన పని విన్నవారికి ముచ్చెమటలు పట్టిస్తోంది.

గుండెను కోసి ఆలుగడ్డలతో కలిపి వండి ఆపై
అమెరికా రాష్ట్రమైన ఓక్లహోమాలో పక్కింటి మహిళతో సహా ట్రిపుల్ హత్యకు పాల్పడిన ఒక వ్యక్తి ఆమె శరీరం నుండి హృదయాన్ని ముక్కలు చేసి, బంగాళాదుంపలతో ఉడికించి, ఇతర బాధితులపై దాడి చేయడానికి ముందు వారికి తినిపించినట్లు యుఎస్ మీడియా తెలిపింది. ఓక్లహోమాలో నిందితుడు, లారెన్స్ పాల్ ఆండర్సన్ తాను హత్య చేసిన మహిళ శరీరం నుండి గుండెను తొలగించాడని అంతేకాదు ఆ హృదయాన్ని తన మామ ఇంటికి తీసుకువచ్చి , అక్కడ అతను దానిని ఉడికించి, మామకు , అత్తకు పెట్టాడని చికాషాలోని గ్రేడి కౌంటీ కోర్టుకు చెప్పారు.

మామయ్య కుటుంబానికి తినిపించిన కసాయి .. ఆపై వారిపై దాడి
ఫిబ్రవరి 9న
ఆండర్సన్ ఇంట్లో మామయ్య మరియు అతని నాలుగేళ్ల మనవడిని చంపాడని మరియు కేళిలో మామయ్య భార్యను తీవ్రంగా గాయపరిచాడని ఆరోపించారు. మాదకద్రవ్యాల ఆరోపణలపై 2017 లో అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ఓక్లహోమా గవర్నర్ కెవిన్ స్టిట్ జైలు నుండి ఆండర్సన్ విడుదలైన కొద్ది వారాల తరువాత ఈ నేరం జరిగింది. కోర్టులో జరిగిన హత్యలను ఆయన అంగీకరించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఒకే రోజు ఆండర్సన్ అత్యంత భయానకంగా సాగించిన మరణ మృదంగం ..
తన పొరుగు ఆండ్రియా లిన్ బ్లాంకెన్‌షిప్‌ను హత్య చేసిన తరువాత నిందితుడు ఇంటికి తిరిగి వెళ్లి హత్య చేసిన మహిళ గుండె ముక్కలుగా కోసి బంగాళాదుంపలతో కలిపి వండి పెట్టాడు. ఆ తర్వాత మామయ్య మరియు వారి మనవడిని చంపాడు.నిందితుడు అత్తను రెండు కళ్ళలో పొడిచాడు. 67 ఏళ్ల వ్యక్తి అయిన ఆండర్సన్ మామ కన్నుమూయగా, కైయోస్ యేట్స్ అనే చిన్నారి గాయపడ్డాడు. అయితే, ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు చిన్నారి తుది శ్వాస విడిచాడు .

తన మామ కుటుంబాన్ని దెయ్యాల నుండి విడుదల చెయ్యటానికి చేశానన్న ఆండర్సన్
నిందితుడు తన అత్త డెల్సీ పైని కూడా దాడి చేశాడు . ఆమె రెండు కళ్ళలో పొడిచాడు. అయితే ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది.
అండర్సన్ తన పొరుగువారి హృదయాన్ని బంగాళాదుంపలతో ఉడికించి, తన కుటుంబానికి పెట్టి దెయ్యాలనుండి విడుదల చేయాలనుకున్నానని చెప్పాడు. బాధితులను హత్య చేసినప్పుడు నిందితుడు మాదకద్రవ్యాల ప్రభావంతో ఉన్నాడా అని నిర్ధారించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిందితుడి ఆరోగ్య పరిస్థితిపై కూడా దర్యాప్తు జరుగుతుంది.












Click it and Unblock the Notifications