షాక్: వ్యక్తి శవం ముందు అర్ధనగ్న యువతుల నృత్యాలు(వీడియో)
బీజింగ్: ఎవరైనా వ్యక్తి చనిపోతే ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. చనిపోయిన వ్యక్తి కుటుంబసభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా ఆవేదన భరితంగా మారిపోతుంది. కానీ, చైనాలో మాత్రం కొందరు మరణిస్తే అలా జరగడం లేదు.
వ్యక్తి మృతి చెందితే ఓ శుభ కార్యంలా, వేడుకలా జరుపుతున్నారు కొందరు. తాజాగా, ఓ వ్యక్తి చనిపోతే.. అతని మృతదేహం వద్ద అర్ధనగ్న నృత్యాలు చేస్తూ పలువురు యువతులు కనిపించారు. అంతేగాక, ఆ శవంపై పడుతూ లేస్తూ చిందులేశారు.
అయితే, ఆ చనిపోయిన వ్యక్తి తాను చనిపోయిన తర్వాత తన అంత్యక్రియలు ఇలాగే జరగాలని కోరుకున్నాడట. అందుకోసమే అతని కుటుంబసభ్యులు ఈ ఏర్పాటు చేయడం గమనార్హం.
కాగా, చైనా, తైవాన్ దేశాలలో కొందరు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే తమ అంత్యక్రియలకు ఎక్కువ మంది జనం వస్తారనేది చనిపోయిన వారి ప్రధానోద్దేశమట. కొంత విడ్డూరమనిపించినా ఇప్పుడు అక్కడ ఇదే ట్రెండ్‌గా మారిపోతోందట. అధికారులు మాత్రం ఇలాంటి చర్యలను ఉపేంక్షిమని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications