వీర్యం కోసం: కదులుతున్న కారులో పురుషుడిపై మహిళల గ్యాంగ్‌రేప్
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా దేశంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తుపాకీతో బెదిరంచి 33ఏళ్ల ఓ పురుషునిపై ముగ్గురు మహిళలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దారి చూపమని తమ బిఎండబ్ల్యూ కారులో ఎక్కించుకుని, కిడ్నాప్ చేసిన ముగ్గురు మహిళలు ఈ దారుణానికి పాల్పడినట్లు డెయిలీ మెయిల్ కథనం పేర్కొంది.
కారులోని ఓ మహిళ ఆ వ్యక్తితో మాట్లాడుతుండగానే మరో మహిళ అతని వెనకవైపు నుంచి వచ్చి కారులోకి తోసేసింది. అతడ్ని బలవంతంగా కిడ్నాప్ చేసిన మహిళలు, గౌటెంగ్ నగరానికి 500 కిలోమీటర్ల దూరంగా తీసుకెళ్లారు.

కారులోనే అతనిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గాయాలపాలైనప్పటికీ అతడ్ని వదలకుండా.. ఉత్తేజ పరిచే పానీయాన్ని బలవంతంగా తాగించారు. ఆ తర్వాత అతనిపై పలుమార్లు ముగ్గురు మహిళలు అత్యాచారానికి పాల్పడ్డారు. అతని నుంచి వచ్చిన వీర్యాన్ని ఓ చల్లని బాక్సులో సేకరించారు.
ఇలా పలుమార్లు చేసిన అనంతరం అతడ్ని కారు నుంచి బయటికి తోసేసి మహిళలు పరారయ్యారు. గౌటెంగ్ నగరంలో ఇలాంటి దారుణ ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందిత మహిళల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications