గయ్యాళి భార్య: కావాలనే జైలు కెళ్లిన భర్త
వాషింగ్టన్: ప్రతి నిత్యం ఇంట్లో భార్య పెట్టే పోరు భరించలేక ఓ వ్యాక్తి కావాలనే జైలుకెళ్లాడు. భార్యకు, ఇంటికి దూరంగా జైలులో ఉంటూ ప్రశాంతంగా ఉన్నానని ఆయన అంటున్నారు.
కావాలనే బ్యాంకు దోపిడీకి యత్నించి జైలు పాలైన ఘటన అమెరికాలో సంచలనం రేపింది. అమెరికాలోని కన్సాన్ ప్రాంతంలో లారెన్స్ జాన్ రిప్పల్ (70), రమీడైస్ దంపతులు నివాసం ఉంటున్నారు.
ప్రతి రోజు రిమీడైస్ పోరుతో లారెన్స్ విసిగిపోయారు. భార్య పెట్టే పోరు భరించలేక జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. భార్యకు విడాకులు ఇవ్వడమో, భార్యతో విడిగా ఉండటమో చెయ్యడానికి అతని మనసు అంగీకరించలేదు.
ఎదైనా నేరం చేసి జైలుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఓ బ్యాంకు దోపిడీ చేస్తే జైల్లో హాయిగా ఉండచ్చు అని స్కెచ్ వేశాడు. అంతే కన్సాన్ సిటీ బ్యాంక్ లోకి వెళ్లాడు. బ్యాంకు క్యాషియర్ దగ్గరకు వెళ్లి అతనికి తుపాకి గురి పెట్టాడు.

3,000 డాలర్లు ఇవ్వాలంటూ క్యాషియర్ ను బెదిరించాడు. క్యాషియర్ డబ్బు ఇచ్చినా లారెన్స్ అక్కడి నుంచి పారిపోలేదు. పోలీసులు వచ్చే వరకు అక్కడే ఉన్నాడు. పోలీసులు లారెన్స్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
తాను నేరం చేశానని లారెన్స్ అంగీకరించారు. లారెన్స్ ను జైలుకు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాను జైలులో సాటి ఖైదీలతో హాయిగా ఉంటున్నానని, మంచి భోజనం అందుతుందని, వైద్యసౌకర్యాలు అందుతున్నాయని అంటున్నారు.
భార్య కంటే జైల్లో సాటి ఖైదీలు తనతో స్నేహంగా ఉంటున్నారని, జీవితాంతం తాను ఇక్కడే ఉంటానని, ఇంటి కంటే జైలు ప్రశాతంగా ఉందని లారెన్స్ అంటున్నారు. భార్య పోరు భరించలేక కావాలనే జైలుకు వెళ్లిన లారెన్స్ మీద ఖైదీలు సానుభూతి చూపిస్తున్నారు.












Click it and Unblock the Notifications