• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

camel gift : గర్ల్‌ఫ్రండ్ బర్త్‌డే గిఫ్ట్‌గా ఒంటెపిల్ల- తల్లికోసం వెళ్లి పిల్లను ఎత్తుకొచ్చి- లవర్స్ అరెస్ట్

|
Google Oneindia TeluguNews

ప్రేమికులు పుట్టినరోజున లేదా వాలంటైన్స్‌ రోజున ఒకరి కొకరు గిఫ్ట్‌లు ఇచ్చుకోవడం చూస్తూనే ఉంటాం. పూలు, పండ్లు, చాక్లెట్లు, గ్రీటింగ్స్‌, సెల్‌ఫోన్లు ఇలా రకరకాల గిఫ్ట్‌లు ఇచ్చిపుచ్చుకోవడం సహజమే. కానీ ఓ ప్రియుడు మాత్రం ఇలా అందరికీ తెలిసిన గిఫ్ట్‌లు ఇస్తే కిక్‌ ఏముందని అనుకున్నాడో ఏమో ఏకంగా అప్పుడే పుట్టిన ఒంటెపిల్లను తీసుకొచ్చి ప్రియురాలికి గిఫ్ట్‌గా ఇచ్చేశాడు. సీన్ కట్‌ చేస్తే ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఎందుకంటే అది కొన్నది కాదు కొట్టేసింది కాబట్టి.

లవర్‌కు పుట్టినరోజు ఖరీదైన గిఫ్ట్‌

లవర్‌కు పుట్టినరోజు ఖరీదైన గిఫ్ట్‌

దుబాయ్‌లో నివసించే ఓ యువకుడు ఓ అమ్మాయిలో ప్రేమలో పడ్డాడు. ఓ రోజు ఆమె పుట్టినరోజు వచ్చింది. గిఫ్ట్‌గా ఏమివ్వాలా అని తీవ్రంగా ఆలోచించాడు. జీవితాంతం గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఏమిస్తే బావుంటుందని చాలా ఆప్షన్స్‌ వెతికాడు. చివరికి ఓ అరుదైన గిప్ట్‌ కనిపించింది. మార్కెట్లో దీని ఖరీదు కూడా చాలా ఎక్కువ. అయితే ఇది ఇస్తే చాలు ఆమె నన్ను కచ్చితంగా జీవితాంతం మర్చిపోదని భావించాడు. కానీ దాన్ని కొనేందుకు స్తోమత లేదు. అప్పుడే ఓ ఐడియా వచ్చింది. ఆ ఐడియా అతని జీవితాన్నే మార్చేసింది.

బర్త్‌డే గిఫ్ట్‌గా అప్పుడే పుట్టిన ఒంటెపిల్ల

బర్త్‌డే గిఫ్ట్‌గా అప్పుడే పుట్టిన ఒంటెపిల్ల

తన లవర్‌కు జంతువులంటే ప్రాణం అని తెలుసుకుని, అప్పుడే పుట్టిన ఓ అరుదైన ఒంటెపిల్లను గిఫ్ట్‌గా ఇవ్వాలని ఆ ప్రియుడు భావించాడు. అనుకున్నదే తడవుగా అప్పుడే పుట్టిన ఓ అరుదైన ఒంటిపిల్లను తీసుకొచ్చి ప్రియురాలికి పుట్టిన రోజు గిఫ్ట్‌గా ఇచ్చేశాడు. దీంతో ఆ ప్రియురాలు కూడా ఆ ఆరుదైన బహుమతికి పొంగిపోయింది. దుబాయ్‌ మార్కెట్లో అత్యంత విలువైన ఇలాంటి ఒంటెపిల్లను గిఫ్ట్‌గా ఇవ్వడమంటే మాటలు కాదు. దీంతో తన మనసు తెలుసుకుని ఇలాంటి బహుమతి ఇస్తావని అనుకోలేదంటూ ప్రియుడ్ని చూసి పొంగిపోయింది. సీన్ కట్‌ చేస్తే ఒకట్రెండు రోజుల్లోనే కథంతా తారుమారైంది.

ఒంటెపిల్ల కొన్నది కాదు కొట్టేసిందట

ఒంటెపిల్ల కొన్నది కాదు కొట్టేసిందట

అయితే ఆ ప్రియుడు ప్రియురాలికి సమర్పించుకున్న గిఫ్ట్‌ కొన్నది కాదట కొట్టేసిందట. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుబాయ్‌ పోలీసులు తమ ఇంట్లో పుట్టిన అరుదైన ఒంటెపిల్ల పోయిందంటూ ఫిర్యాదు రావడంతో దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత ఈ యువకుడే ఆ ఒంటెపిల్లను దొంగిలించినట్లు గుర్తించారు. అదుపులోకి తీసుకుని తమ దైన శైలిలో ప్రశ్నిస్తే అసలు విషయం బయటపెట్టేశాడు. లవర్‌కు అరుదైన గిఫ్ట్ ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈ ఒంటెపిల్లను కొట్టేసినట్లు అంగీకరించాడు.

తల్లి కోసం వెళ్లి పిల్లను ఎత్తుకొచ్చిన వైనం

తల్లి కోసం వెళ్లి పిల్లను ఎత్తుకొచ్చిన వైనం

తన ప్రియురాలికి పుట్టినరోజున గిఫ్ట్ ఇద్దామనుకున్న ఆ ప్రియుడు అసలు కొట్టేయాలనుకున్నది ఈ ఒంటెపిల్లను కాదట. దాని తల్లినే అని పోలీసుల విచారణలో బయటపడింది. ఒంటెను కొట్టేద్దామని ఆ ఇంటికి వెళ్లేసరికి అప్పుడే పిల్లను కన్న ఆ ఒంటె కనిపించింది. దాన్ని ఎత్తుకురావడం కుదరలేదట. దీంతో అప్పుడే పుట్టిన ఈ ఒంటెపిల్లను ఎత్తుకొచ్చి ప్రియురాలికి గిఫ్ట్ ఇచ్చినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. ఆ తర్వాత దుబాయ్‌ చట్టాల ప్రకారం వీరిద్దరినీ అరెస్టు చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఒంటెల సంఖ్య గతంతో పోలిస్తే బాగా తగ్గిపోయింది. దీంతో ఒంటెలను కాపాడే విషయంలో పోలీసులు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నారు.

English summary
A Dubai resident wanted to get a high-value came for his girlfriend on her birthday and stole a newborn camel. Emirati police arrested the man for allegedly stealing the valuable newborn camel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X