శవం లేచి దుప్పటి అడిగిందని.. షాక్ తిన్న సెక్యూరిటీ..
తప్ప తాగి కుప్పకూలిపోయిన వ్యక్తిని చనిపోయాడని భావించి మార్చురీలో పెట్టిన ఘటన పోలండ్ లో జరిగింది.
పోలండ్: తప్ప తాగి కుప్పకూలిపోయిన వ్యక్తిని చనిపోయాడని భావించి మార్చురీలో పెట్టిన ఘటన పోలండ్ లో జరిగింది. కమిల్ అనే ఓ వ్యక్తి స్థానికంగా ఉండే ఓ పబ్‌కి వెళ్లి పీకలదాకా వోడ్కా తాగి పడిపోయాడు. స్నేహితులంతా హుటాహుటిని అతన్ని కమిల్‌ని స్థానిక ఆస్పత్రికి తరలించగా అతను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కమిల్ కుటుంబ సభ్యులెవరు సమయానికి అందుబాటులో లేకపోవడంతో కమిల్ మృతదేహాన్ని మార్చురీలో పెట్టారు.

అనంతరం అదే రోజు రాత్రి మార్చురీ గది నుంచి పెద్ద పెద్ద శబ్దాలు రావడం మొదలైంది. దీంతో హడలిపోయిన సెక్యూరిటీ గార్డు.. భయం భయంగానే మార్చురీ తలుపు తెరిచి చూశాడు. అంతే..నగ్నంగా పడుకుని ఉన్న కమిల్ 'చలేస్తోంది దుప్పటి కావాలని' అడగడంతో సెక్యూరిటీ షాక్ తిన్నాడు. శవం లేచి మాట్లాడమేంటి అని తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. విషయాన్ని పోలీసులకు చేరవేసి వైద్యులను పిలిచాడు. ఆ తర్వాత కమిల్‌కి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతను చనిపోయిన మాట అవాస్తవం అని తేల్చారు.












Click it and Unblock the Notifications