ఇటలీ ప్రధాని మెలోనీ ఆత్మకథకు ప్రధాని మోదీ ముందుమాట
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆత్మకథకు ప్రధాని నరేంద్ర మోదీ ముందుమాట రాశారు." ఐయామ్ జార్జియా.. మై రూట్స్.. మై ప్రిన్సిపల్స్".. అనే పుస్తకానికి ప్రధాని మోదీ ముందుమాట రాశారు. ఈ మేరకు జార్జియా మెలోనీని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆమె గొప్ప దేశభక్తురాలు.. ప్రస్తుత సమకాలీన రాజకీయాల్లో ఆమె సమర్థవంతమైన నేత అని అభివర్ణించారు. ఆమె జీవితం.. నాయకత్వ లక్షణాలు ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటాయని తెలిపారు. ఈ పుస్తకాన్ని రూపా పబ్లికేషన్ల్ త్వరలో భారత్ లో రిలీజ్ చేయనుంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. అనేక అంతర్జాతీయ వేదికల్లో ఇరువురు ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటారు. అలాగే ఇటలీ భారత్ మధ్య కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా జార్జియా మెలోనీ ఆత్మకథ బుక్ కు ప్రధాని నరేంద్ర మోదీ ముందుమాట రాశారు. " ఐయామ్ జార్జియా.. మై రూట్స్.. మై ప్రిన్సిపల్స్" అనే పుస్తకంలో జార్జియా చిన్ననాటి జ్ఞాపకాలు, రాజకీయ, వ్యక్తిగత జీవితం, తల్లిదండ్రులు.. ఇలా తన జీవితంలో జరిగిన సంఘటనలను ఆ బుక్ లో పొందుపరిచారు.

భారత్ లో త్వరలో ఈ పుస్తకం అందుబాటులోకి రానుంది. ఈ బుక్ ను రూపా పబ్లికేషన్స్ సంస్థ ప్రచురించనుంది. ప్రధాని మోదీ నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం స్ఫూర్తితోనే తాను ఆత్మకథ రాసినట్లు మెలోనీ పేర్కొన్నారు. ఈ పుస్తకంలో రాజకీయంగా సవాళ్లు, ఎన్నికల ప్రచార సమయంలో గర్భిణిగా, సింగిల్ పేరెంట్ గా ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావించినట్లు సమాచారం. ఈ ఆత్మకథ 2021లో తొలిసారి మార్కెట్ లోకి వచ్చింది. అప్పట్లోనే బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. ఇటీవల అమెరికాలోనూ ఇది విడుదలైంది. తాజాగా భారత్ లోనూ ఈ బుక్ ను అందుబాటులోకి తెచ్చేందుకు మెలోనీ ఏర్పాట్లు చేస్తున్నారు.
మెలోనీ ఆత్మకథకు ముందుమాట రాయడం తనకు ఎంతో గౌరవప్రదంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు.












Click it and Unblock the Notifications