షాక్: యూరప్ ను వణికిస్తోన్న సైబర్ దాడి
సైబర్ భూతం మరోసారి యూరప్ ను వణికిస్తోంది. యూరప్ దేశాల్లోని పలు సంస్థలపై మంగళవారంనాడు సైబర్ దాడి చోటుచేసుకొంది.
లండన్: సైబర్ భూతం మరోసారి యూరప్ ను వణికిస్తోంది. యూరప్ దేశాల్లోని పలు సంస్థలపై మంగళవారంనాడు సైబర్ దాడి చోటుచేసుకొంది.
యూరప్ లోఅతిపెద్ద సైబర్ అటాక్ చోటుచేసుకొంది. ఉక్రెయిన్ లో భారీ సైబర్ దాడికి పాల్పడ్డ హ్యకర్లు ..నేషనల్ బ్యాంక్ లు, ఎయిర్ పోర్లు, విద్యుత్ సంస్థలకు కంప్యూటర్లలోకి వైరస్ ను పంపించారు.

డిస్క్ కంటెయన్స్, ఎర్రర్ అంటూ కంప్యూటర్ తెరపై మేసేజ్ చూపిస్తోంది. దీంతో యూరప్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఉక్రెయిన్, బ్రిటన్ , స్పెయిన్ దేశాలు ఈ సైబర్ దాడికి గురయ్యాయి. ఈ దాడి అసాధారణమైందని ఉక్రెయిన్ ప్రధాని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ కంపూటర్ నెట్ వర్క్ లు డౌన్ అయ్యాయి. బ్యాంకులు, విద్యుత్ రంగ సంస్థలు దీంతో తీవ్రంగా ప్రభావితమయ్యాయని అధికారులు ప్రకటించారు.












Click it and Unblock the Notifications