వ్యాక్సిన్ లేని మరో వైరస్ విజృంభణ-పలువురు మృతి: డబ్ల్యూహెచ్ఓ హైఅలర్ట్

ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టించిన విలయాన్ని ఇప్పట్లో ఎవరూ మర్చిపోలేరు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిమందిని పొట్టనబెట్టుకుందీ మహమ్మారి. తాజాగా మరో వైరస్ వ్యాప్తి చెందడం మొదలు పెట్టింది. ఇప్పటికే తొమ్మిదిమంది మరణించారు.

జెనీవా: సుమారు రెండున్నర సంవత్సరాల పాటు ప్రపంచం మొత్తాన్నీ వణికించిన ప్రాణాంతక కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా గుర్తింపు పొందింది చైనా. హ్యూబే ప్రావిన్స్‌లోని వుహాన్ సిటీలో పుట్టుకొచ్చిన ఈ మహమ్మారి బారిన పడని దేశమంటూ లేదు. అన్ని దేశాల్లోనూ అడుగు పెట్టింది. లక్షలాది మంది ప్రజల ప్రాణాలను తీసింది. కోవిడ్ బారిన తీవ్రంగా పడిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంటోంది. 10 కోట్ల వరకు పాజిటివ్ కేసులు ఇక్కడ నమోదయ్యాయి. 11 లక్షల మందికి పైగా దీని బారిన పడి మరణించారు.

 కరోనా తీవ్రత తగ్గినా..

కరోనా తీవ్రత తగ్గినా..

కోవిడ్ మరణాల్లో రెండో స్థానంలో భారత్ నిలిచింది. నాలుగున్నర కోట్లకు పైగా పాజిటివ్ కేసులు భారత్‌లో నమోదయ్యాయి. 5.30 వేల మంది మృతిచెందారు. కరోనా వైరస్‌‌ను నిర్మూలించడానికి భారత్ సహా కొన్ని దేశాలు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన తరువాత దీని తీవ్రత తగ్గింది. పూర్తిగా నిర్మూలించకపోయినప్పటికీ- అన్ని దేశాల్లోనూ ఈ మహమ్మారి విస్తరించే వేగం అదుపులోకి వచ్చింది. మాస్కులను ధరించాల్సిన అవసరం లేనంతగా దీని తీవ్రత తగ్గిపోయింది.

మరో వైరస్..

మరో వైరస్..

తాజాగా మరో వైరస్ వ్యాప్తి చెందడం మొదలు పెట్టింది. ఇప్పటికే తొమ్మిది మంది దీని బారిన పడి మరణించారు కూడా. దీన్ని మార్‌బర్గ్ వైరస్ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఆఫ్రికన్ దేశం ఈక్వెటోరియల్ గినియాలో దీన్ని గుర్తించింది డబ్ల్యూహెచ్ఓ. దీని బారిన పడి ఇప్పటికే తొమ్మిది మంది మరణించారు. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు ఈ వైరస్ కు ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఈక్వెటోరియల్ గినియా సరిహద్దు దేశాలను డబ్ల్యూహెచ్ఓ అప్రమత్తం చేసింది.

రక్తనాళాలు చిట్లి..

రక్తనాళాలు చిట్లి..

కామెరూన్- గబన్ సరిహద్దులో ఉన్న కీ-ఎన్‌టెమ్ ప్రావిన్స్‌లో అంత్యక్రియలకు వెళ్లిన వ్యక్తుల్లో తొలిసారిగా మార్ బర్గ్ వైరస్ లక్షణాలు కనిపించాయి. వైరస్ లక్షణాలు కనిపించిన అతి కొద్దిరోజుల్లోనే తొమ్మిదిమందిని పొట్టనబెట్టుకుంది. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే తీవ్రమైన జ్వరం సోకుతుంది. దీని తీవ్రతకు రక్తనాళాలు చిట్లిపోతాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ వైరస్ లక్షణాలు- ఇదివరకు ఆఫ్రికన్ దేశాలను వణికించిన ఎబోలాను పోలి ఉంటాయని పేర్కొంది.

1967లో..

1967లో..

జర్మనీలోని మార్ బర్గ్, ఫ్రాంక్‌ ఫర్ట్‌, సెర్బియా రాజధాని బెల్‌ గ్రేడ్‌లో 1967లో మొదటిసారిగా ఈ వైరస్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. అందుకే దీనికి మార్ బర్గ్ అనే పేరు పెట్టారు. మార్ బర్గ్- ఎబోలా వైరస్‌ రెండూ కూడా ఫిలోవైరస్ జాతికి చెందినవి. 88 శాతం ఇది ప్రాణాంతకంగా నిర్ధారించింది డబ్ల్యూహెచ్ఓ. సకాలంలో వైరస్ ను గుర్తించిన వెంటనే చికిత్స అందించడం వల్ల మరణాల రేటును తగ్గించవచ్చని తెలిపింది.

గబ్బిలాల నుంచే..

గబ్బిలాల నుంచే..

కరోనా వైరస్ తరహాలోనే ఇది కూడా గబ్బిలాల నుంచే ఆవిర్భవిస్తుంది. వేగంగా విస్తరించే లక్షణాలు దీనికి ఉన్నాయి. రక్తస్రావం, హైఫీవర్, అతిసారం, వాంతులు, విరేచనాలు, తీవ్రమైన తలనొప్పిని కలిగించడం ఈ వైరస్ లక్షణం. ఆఫ్రికాలోని అంగోలా, డెమొక్రటిక్ రిపబ్లిక్ కాంగో, గినియా, కెన్యా, దక్షిణాఫ్రికా, ఉగాండాలో గతంలో ఈ వ్యాప్తి చెందింది. అప్పట్లోనూ మరణాలు నమోదయ్యాయి. ఘనాలో గత ఏడాది మార్ బర్గ్ వైరస్ మరణాలు వెలుగులోకి వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+