ఉత్తర కొరియాను తక్కువ అంచనా వేయలేం, అమెరికా ముందున్న మార్గాలివే...

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తరకొరియా నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ల మధ్య మాటలు తూటాలై పేలుతుండటంతో ప్రపంచమంతటా యుద్ధమేఘాల భయం అలముకుంది.

ఈ నేపథ్యంలో.. అమెరికాపై అణుదాడి చేస్తామని పలుమార్లు ఉత్తరకొరియా హెచ్చరించగా.. అందుకు ప్రతిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా సంచలన ప్రకటనలు, వ్యాఖ్యనాలు చేస్తున్నారు.

ఉత్తర కొరియా 'ఖతర్నాక్ ప్లాన్'! జపాన్ మీదుగా గువామ్ దీవిపైకి.. హాసంగ్-12 మిస్సైళ్లతో దాడి!!

ఒకవేళ యుద్ధం గనుక సంభవిస్తే.. ఉత్తరకొరియాను అదుపు చేయడానికి అమెరికా ముందు అసలు ఏమేం మార్గాలున్నాయి? దీనిపై ఆక్సఫర్డ్‌కు చెందిన క్రైసిస్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌ మార్క్‌ ఆల్మండ్‌ కొన్ని విషయాలు వెల్లడించారు. ఉత్తరకొరియాను తక్కువగా అంచనా వేసి, మూర్ఖంగా ట్రంప్ అడుగు ముందుకేస్తే.. అమెరికా ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందో ఆయన వివరించారు. అవేమిటో మీరూ చూడండి!

పూర్తి సైన్యంతో దిగాల్సిందే..

పూర్తి సైన్యంతో దిగాల్సిందే..

గతంలో యుద్ధం జరిగినప్పుడు.. ఉత్తరకొరియాకు నేవీ లేదు కాబట్టి అమెరికా బలగాలు సముద్రతీరం నుంచి ప్యాంగ్‌యాంగ్‌కు వెళ్లడానికి పెద్దగా కష్టపడలేదు. కానీ, ప్రస్తుతం పరిస్ధితి మారిపోయింది. ఉత్తరకొరియా పూర్తిస్ధాయిలో తన సైన్యాన్ని నిర్మించుకుంది. ఇలాంటి దశలో అమెరికా కేవలం దక్షిణకొరియాలో ఉన్న తన సైన్యాన్ని మాత్రమే వినియోగించి యుద్ధ రంగంలోకి దిగితే ఓటమి చవిచూడక తప్పదు. ఒకవేళ ఆప్ఘనిస్తాన్‌, ఇరాన్‌లలో మొహరించిన తన సైన్యాన్నంతటినీ ఉత్తరకొరియాకు తరలించాలని అమెరికా భావించినా, అది అసాధ్యం. కాబట్టి దక్షిణకొరియాకు ఉన్న ఆరు లక్షల యాభై వేల మంది సైన్యాన్ని కూడా యుద్ధంలోకి దింపాల్సిందిగా అమెరికా కోరాలి. అయితే దీనికి దక్షిణకొరియా ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే.. తన సైన్యాన్ని అమెరికాకు ఇచ్చిన మరుక్షణమే ఉత్తరకొరియా దక్షిణకొరియాపై అణుదాడి చేయడం ఖాయం.

North Korea vs US : Donald Trump issued an Ultimatum To Kim Jong-un
చైనాతో ముందుగానే చర్చించాలి...

చైనాతో ముందుగానే చర్చించాలి...

ఇప్పటికే అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించాలని చూస్తున్న చైనాకు.. తమ ప్రాంతంలోని ఓ దేశంపై అమెరికా దండెత్తడం రుచించకపోవచ్చు. కాబట్టి ఉత్తరకొరియాపై యుద్ధాని దిగడానికి ముందే అమెరికా.. చైనాతో చర్చించాల్సి ఉంటుంది. లేకుంటే ఉత్తరకొరియా-అమెరికాల మధ్య యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చు. అయినా లెక్కచేయకుండా అమెరికా భారీ సైనిక దళంతో ఉత్తరకొరియాలో ప్రవేశించాలని చూస్తే.. అమెరికాకు తీవ్ర నష్టం జరగొచ్చు. ఎందుకంటే, ఉత్తరకొరియా నియంత కిమ్‌ జాంగ్ ఉన్ వద్ద దాదాపు 60కి పైగా అణ్వాయుధాలు, లెక్కకు మించిన జీవ, రసాయన ఆయుధాలు ఉన్నట్లు వినికిడి.

భారీ వైమానిక దాడులు వద్దు...

భారీ వైమానిక దాడులు వద్దు...

అణ్వాయుధాలు తయారు చేస్తున్న ఉత్తరకొరియాపై 1994లోనే అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ వైమానిక దాడి చేయించారు. అయితే, అప్పుడు ఉత్తరకొరియా పరిస్ధితి వేరు. ఆ దాడిలో తమ స్ధావరాలను కాపాడుకోలేక ఆ దేశం చతికిలపడింది. కానీ ఇప్పుటి ఉత్తరకొరియా ఆయుధ సంపత్తిలో బాగా ఆరి తేరింది. అమెరికా దీనిని దృష్టిలో ఉంచుకోవాలి. ఉత్తరకొరియా అణుస్ధావరాలను ధ్వంసం చేసేందుకు జపాన్‌, దక్షిణకొరియా, గ్వామ్‌లలో ఉన్న వైమానిక దళంతో అమెరికా గనుక ప్రయత్నిస్తే.. ఉత్తర కొరియా జాగ్రత్త పడిపోతుంది. అమెరికా దాడి చేసేలోపే తమ అణు స్థావరాలలోని క్షిపణులను ఉత్తరకొరియా మరోచోటికి తరలించగలదు. అంతేకాదు, ఉత్తరకొరియా తాజాగా తయారు చేసుకున్న క్షిపణులను అతికొద్ది సమయంలోనే సిద్ధం చేసి ప్రయోగించే ప్రమాదమూ లేకపోలేదు. కాబట్టి, భారీ వైమానిక దాడులతో ఉత్తరకొరియాను అడ్డుకుందామని అనుకుంటే అమెరికా బొక్కబొర్లా పడటం ఖాయం.

ఉత్తరకొరియా సైన్యాన్ని పూర్తిగా తుదముట్టించాలి...

ఉత్తరకొరియా సైన్యాన్ని పూర్తిగా తుదముట్టించాలి...

ఉత్తరకొరియాలో ఉన్న అణు ఆయుధ స్ధావరాలను నాశనం చేయడం ఒక్కటే యుద్ధంలో అమెరికాను విజయతీరాలకు చేర్చదు. రక్త దాహానికి అలవాటు పడ్డ కిమ్‌ లాంటి నియంతను నామరూపాల్లేకుండా చేయాలంటే.. ఆ దేశ సైన్యాన్ని పూర్తిగా తుదముట్టించాలి. కనిపించిన సైనికుడిని నరికిపారేసి మారణహోమం సృష్టించాలి.
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌, అతని కీలక కమాండర్లు కౌంటర్‌ అటాక్‌కు ప్లాన్‌ చేసే లోపే స్మార్ట్‌ బాంబు సాయంతో వారిని మట్టుబెట్టగలగాలి. ఒకవేళ కిమ్‌ను అంతం చేయడంలో అమెరికా మిస్‌ అయితే, ఆ తరువాత పొరుగుదేశాలైన జపాన్‌, దక్షిణకొరియాలతోపాటు ఉత్తరకొరియా రేంజ్‌కు అందుబాటులో ఉన్న ప్రతి బేస్‌ సర్వనాశనం అవుతుంది. ఒకవేళ అమెరికా-దక్షిణకొరియా బలగాలు ఉత్తరకొరియాను తమ అధీనంలోకి తీసుకున్నా.. గెరిల్లా యుద్ధాలు మాత్రం ఆగవు. పెద్ద సంఖ్యలో ఉత్తరకొరియన్లు చైనాకు శరణార్థులుగా వెళ్లే అవకాశం ఉంటుంది.

ఉత్తరకొరియాపై అణుదాడి జరిపితే...

ఉత్తరకొరియాపై అణుదాడి జరిపితే...

ఒకవేళ అగ్రరాజ్యం అమెరికా.. అణు దాడే శరణ్యంగా భావించి ఉత్తరకొరియాను ప్రపంచపటం మీద లేకుండా చేస్తే.. మిగిలిన ప్రపంచదేశాలు ఆలోచనలో పడతాయి. ఆత్మరక్షణ కోసం ప్రయత్నిస్తాయి. అమెరికాతో సైనిక కూటములుగా ఏర్పడిన దేశాలు కూడా ఆయా కూటముల నుంచి బయటికి వెళ్లిపోతాయి. భవిష్యత్తులో అమెరికా తమకేదైనా ఆపద తలపెట్టవచ్చన్న అనుమానంతో చైనా, రష్యాలాంటి దేశాలు భారీ స్ధాయిలో రక్షణ బడ్జెట్‌ను పెంచి ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తాయి.

చైనాను ఎంత ఒత్తిడి చేసినా...

చైనాను ఎంత ఒత్తిడి చేసినా...

ఉత్తరకొరియాపై ఒత్తిడి తీసుకొద్దామని ట్రంప్‌ గతంలో చైనా ద్వారా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. ఒకదశలో చైనాపై కూడా తీవ్ర ఒత్తిడి కలిగేలా ట్రంప్ మాట్లాడారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకంటే, ఉత్తరకొరియాతో చైనాకు ఉన్న సత్సంబంధాలు కూడా అంతంతమాత్రమే. చైనాతో అంటి ముట్టనట్లు ఉంటున్న ఉత్తరకొరియా.. తామరకుపై నీటి బిందువు వలే ఎప్పుడైనా జారిపోయేందుకు సిద్ధంగా ఉంది. చైనా గట్టిగా ఒత్తిడి చేస్తే.. అది చైనాపై కూడా తిరగబడేందుకు వెనకాడదు. ఇది కూడా చైనాకు భయమే. అందుకే ఉత్తరకొరియా, అమెరికా వివాదంలో చైనా కూడా పెద్దగా జోక్యం చేసుకోకుండా తటస్థంగానే ఉండిపోయింది. అమెరికాకు అనుమానం రాకుండా ఉండేందుకు ఉత్తరకొరియాకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా పైకి నాటకం ఆడింది.

అంతర్జాతీయ చర్యలు తీసుకుంటే...

అంతర్జాతీయ చర్యలు తీసుకుంటే...

పదేళ్ల క్రితమే ప్యాంగ్‌యాంగ్‌ అణు పరీక్షలు చేయడం ప్రారంభించంది. ఇది గమనించిన ఐక్యరాజ్య సమితి భద్రతామండలి ఆ దేశానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తూనే ఉంది. ఈ విధంగా చూసినా అమెరికాకు.. రష్యా, చైనాల మద్దతు కూడా బలంగా ఉంది. ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా తీర్మానాలు ఆమోదించేందుకు రష్యా, చైనా కూడా వెనుకాడటం లేదు. బాహ్య ప్రపంచం నుంచి ఉత్తరకొరియాకు వాణిజ్యపరంగా సహాకారం అందిస్తుంది కూడా ఈ రెండు దేశాలే. ఉత్తరకొరియాతో వాణిజ్యాన్ని నిలిపివేయాలని భద్రతామండలి తీర్మానం చేయడం వల్ల ఉత్తరకొరియా అతలాకుతలమయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇలా చేస్తే రష్యా, చైనాల మీద కక్ష్యతో ఆ దేశాలపై అణుదాడికి ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ వెనుకాడకపోవచ్చు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The war of threats between President Trump and the North Korean dictator, Kim Jong-Un, is setting global nerves on edge. We’re used to blood curdling propaganda from Pyongyang, but an American president using the same kind of language – ‘fire and fury’ – is a new departure. The threat of nuclear war in East Asia is suddenly alarmingly close.But before this hysterical rhetoric reaches a climax, Western leaders must consider what history and strategic analysis teaches us about how to avoid calamity – or how best to contain it.
Please Wait while comments are loading...