• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దిగజారుతోన్న జనాభా: చైనా సంచలన నిర్ణయం: పిల్లలను కనడంపై లిమిట్ ఎత్తివేత

|

బీజింగ్: ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం ఏది అనే ప్రశ్నకు దాదాపుగా ప్రతి ఒక్కరికీ తెలిసిన సమాధానం.. చైనా. 2019 లెక్కల ప్రకారం చూసుకుంటే- చైనా జనాభా 139.77 కోట్లు. దేశ జనాభా పెరగడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అక్కడి ప్రభుత్వం.. పిలల సంఖ్యపై పరిమితిని విధించింది. ఇద్దరు పిల్లలను మాత్రమే కనాల్సి ఉంటుందని ప్రకటించింది. దీనికోసం ప్రత్యేకంగా ఓ విధానాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చింది. ముగ్గురు పిల్లలను కన్న దంపతులపై 1,30,000 యువాన్‌ల భారీ జరిమానా సైతం విధించేది.

తగ్గుముఖం పట్టిన చైనా జనాభా..

తగ్గుముఖం పట్టిన చైనా జనాభా..

ఇప్పుడా పరిస్థితి లేదు. తాజాగా ఇందులో మార్పులను చేసింది చైనా ప్రభుత్వం. పిల్లలను కనడంపై విధించిన ఆంక్షలను సవరించింది. ముగ్గురిని కనడానికి అవకాశం కల్పించింది. రెండేళ్లుగా చైనా జనాభా సంఖ్య తగ్గుముఖం పట్టింది. జననాల రేటు దారుణంగా పడిపోయింది. ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగితే- జనాభా మరింత తగ్గిపోయే ప్రమాదం ఉందని చైనా అంచనా వేసింది. దీనికితోడు కరోనా వైరస్ వల్ల వేల సంఖ్యలో తమ దేశ పౌరులు మరణించడం, అనారోగ్యానికి గురి కావడం వంటి పరిణామాలను పరిగణనలోకి తీసుకుంది.

ఇకపై ముగ్గురికి అనుమతి..

ఇకపై ముగ్గురికి అనుమతి..

జనాభా తగ్గుముఖం పట్టడాన్ని నివారించడానికి సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటిదాకా అనుసరిస్తూ వస్తోన్న పిల్లల విధానంలో మార్పులు చేసింది. ముగ్గురు పిల్లలను కనడానికి అవకాశం కల్పించింది. ఇకపై కొత్త దంపతులు ముగ్గురు పిల్లలను కనవచ్చని చైనా వెల్లడించింది. చైనా అధినేత గ్ఝి జిన్‌పింగ్ అధ్యక్షతన ఏర్పాటైన పొలిట్‌బ్యురో సమావేశంలో చర్చించిన అనంతరం ప్రభుత్వం ఈ సవరణలు చేసినట్లు గ్ఝిన్‌హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

 వృద్ధదేశం కాకూడదు..

వృద్ధదేశం కాకూడదు..


ఒక కొత్త జంట ముగ్గురు పిల్లలను కనడానికి వీలు కల్పించేలా చట్టంలో సవరణలు చేయాలని, పిల్లల పాలసీలో మార్పులు చేయాలని పొలిట్‌బ్యురోలో నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కొంతకాలంగా జనాభాలో వృద్ధుల రేటు అధికంగా ఉంటోందని, దాని గ్రాఫ్ క్రమంగా పైకి పోతోందని గుర్తించింది ప్రభుత్వం. అదే పరిస్థితి కొనసాగితే- తమది వృద్ధదేశం అవుతుందని, పాతతరానికి ప్రతినిధిగా మారే అవకాశాలు లేకపోలదని జిన్‌పింగ్ భావించినట్లు న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ పరిస్థితిని నిివారంచడానికి ముగ్గురు పిల్లలను కనడాపికి వీలుగా చైల్డ్ పాలసీని సవరించినట్లు పేర్కొంది.

  Coronavirus In India: కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల !
  మానవ వనరులుంటేనే..

  మానవ వనరులుంటేనే..

  ఈ విషయంలో చైనా అధ్యక్షుడు ముందుచూపుతో వ్యవహరించినట్లు కితాబిచ్చింది మానవ వనరుల మీదే ఏ దేశమైనా ఆధారపడి ఉంటుందని, అదే లేకపోతే- అనేక రంగాల్లో వెనుకబడి పోతామనే భావన ప్రభుత్వంలో ఉన్నట్లు గ్ఝిన్‌హువా తెలిపింది. దీనికి అనుగుణంగా పాలసీలో మార్పులను ప్రతిపాదించిందని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని స్పష్టం చేసింది. ముగ్గురు పిల్లలను కన్నవారిపై విధించే జరిమానాను పూర్తిగా ఎత్తేయబోతోందని ఆ న్యూస్ ఏజెన్సీ స్పష్టం చేసింది. చైనాను యువతరానికి ప్రతీనిధిగా తీర్చిదిద్దాలని జిన్‌పింగ్ భావిస్తున్నట్లు తెలిపింది.

  English summary
  China said on Monday that married couples may have up to three children, a major policy shift from the existing limit of two after recent data showed a dramatic decline in births in the world's most populous country.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X