మసూద్ అజర్ హెచ్చరిక: తెలియదన్న పాక్
ఇస్లామాబాద్: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి సూత్రధారి అనుమానిస్తున్న జైష్ ఎ మొహ్మద్ ఛీఫ్ మౌలానా మసూద్ అజర్ పాకిస్థాన్‌కు హెచ్చరిక చేశాడు. దేశాన్ని ప్రమాదంలో పడేస్తున్నారని హెచ్చరించాడు. భారత్ ఇచ్చిన ఆధారాల ఆధారంగా జైష్ ఎ మహ్మద్ కార్యాలయాలను సీజ్ చేయడం, ఉగ్రవాదులను అరెస్ట్ చేయడంపై కన్నెర్ర చేశాడు.
ప్రస్తుత నవాజ్ షరీఫ్ చర్యల కారణంగా పాకిస్థాన్ ప్రమాదంలో పడుతుందని ఆయన హెచ్చరించారు. జిహాద్‌కు షరీఫ్ ప్రభుత్వం మద్దతివ్వకపోవడం అన్యాయమని అన్నాడు. మసూద్ అజర్ కూడా అరెస్టయ్యాడని పాక్ మీడియా ద్వారా తెలిసింది.

అయితే పాకిస్ధాన్ ఈ సమాచారాన్ని ఇంకా ధృవీకరించలేదు. అజర్ మసూద్‌ను అరెస్టు చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో తన కలం పేరు సైదీతో అజర్ ఆ కథనం రాశాడు. అది జైషథ్ ఎ మొహమ్మద్ అధికారిక పత్రికగా భావించే ఆల్ ఖలాంలో గత సాయంత్రం ఆ వ్యాసం అచ్చయింది.
తన వ్యాసంలో అతను భారత్‌లోని తీహార్ జైలులో, కోట్ భల్వాల్‌లో, పాకిస్తాన్‌లోని భహల్పూర్ జైలులో గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు. తన గృహ నిర్బంధాన్ని కూడా ప్రస్తావించారు. భారత్‌తో సాన్నిహిత్యం పెంచుకోవడంపై కూడా పాకిస్తాన్‌పై ఆయన విరుచుకుపడ్డారు.
ఇదిలావుంటే, మౌలానా మసూద్ అజర్ అరెస్టయినట్లు తమకు తెలియదని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం స్పష్టం చేసింది. అరెస్టు జరిగినట్లు తనకు సమాచారం లేదని విదేశాంగ శాఖ కార్యాలయం అధికార ప్రతినిధి ఖాజీ ఖలీలుల్లా అన్నారు.












Click it and Unblock the Notifications