ప్యారిస్‌లో జనంపై ఒక్కసారిగా కాల్పులు: ముగ్గురు మృతి, పలువురికి గాయాలు
ప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని నగరం ప్యారిస్‌లో ఓ ముష్కరుడు కాల్పులకు తెగబడ్డాడు. అతడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ప్యారిస్‌లోని 10వ అరోండిస్‌మెంట్‌లోని రూ డీ
ఎన్‌గిన్‌లోని కుర్దిష్ సాంస్కృతిక కేంద్రంలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు అనుమానిత సాయుధుడిని అరెస్టు చేసినట్లు ఫ్రెంచ్ టెలివిజన్ నెట్‌వర్క్ బీఎఫ్ఎం టీవీ వెల్లడించింది. హంతకుడు 70 ఏళ్ల వ్యక్తి అని సమాచారం. 'కాల్పులు జరిపిన వ్యక్తిని ఆయుధంతో అరెస్టు చేశాం. ప్రమాదం ముగిసింది' అని పోలీసులు తెలిపారు. నిందితుడు ఎందుకు కాల్పులు జరిపాడనే విషయం ఇంకా తెలియరాలేదు.

సెలూన్లో కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఒక్కసారిగా కాల్పుల ఘటన జరగడంతో అక్కడి ప్రజలంతా భయాందోళనలకు గురయ్యారు. సాయం చేయాలని పోలీసుల కోసం అరిచారని తెలిపారు. కాల్పుల్లో పలువురు గాయపడ్డారని చెప్పారు.
ప్రస్తుతం కాల్పులు జరిగిన ప్రాంతానికి ప్రజలు వెళ్లకూడదని పోలీసులు తెలిపారు. కాల్పుల ఘటనలో గాయపడినవారందరినీ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
Paris: French media reports at least 2 dead in a shooting in the 10th arrondissement. There are some reports the perpetrator - a man in his 60s - targeted a Kurdish cultural centre on rue D’Enghien.
— Holly Johnston (@h0llyjohnston) December 23, 2022
pic.twitter.com/yVxZqKQ72E
రద్దీగా ఉన్న ప్రాంతంలో కాల్పుల ఘటన చోటు చేసుకోవడంతో రాజధానిలో ఈ ఘటన కలకలం రేపింది. నిందితుడు సుమారు పది రౌండ్ల వరకు కాల్పులు జరిపాడని సమీపంలోని ఒక దుకాణదారుడు తెలిపారు.
🇫🇷
— ⭐ Index Hakeem 🟣⭐ (@hakrashaa) December 23, 2022
🚨قبيل قليل🚨في باريس ، في شارع إنغين ، فتح رجل يبلغ من العمر 60 عامًا النار.
تم القبض على مطلق النار.
بحسب آخر التقارير الإعلامية ، أسفر إطلاق النار الذي وقع في باريس عن مقتل شخصين وإصابة 4 آخرين.
Paris Shooting: 60-year-old man opens fire in French capital (BFMTV) pic.twitter.com/O9TQcpyX0C
కాగా, 2015లో ఫ్రాన్స్ రాజధానిలో జరిగిన వరుస బాంబు దాడులు, కాల్పుల్లో 130 మంది మరణించగా, 490 మందికి పైగా గాయపడ్డారు.
నవంబర్ 13, 2015 రాత్రి నేషనల్ స్పోర్ట్స్ స్టేడియం వెలుపల ఆత్మాహుతి బాంబర్లు దాడి చేశారు. ఈ దాడికి ఇస్లామిక్ స్టేట్ బాధ్యత వహించింది. ఈగల్స్ ఆఫ్ డెత్ మెటల్ రాక్ సంగీత కచేరీ సందర్భంగా బాటాక్లాన్ థియేటర్ వద్ద తుపాకీ దాడిలో 90 మంది మరణించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications