ఆమెకు రూ.4800 కోట్ల పైచిలుకు లాటరీ తగిలింది
మసాచుసెట్స్‌కు చెందిన 53 సంవత్సరాల మావిస్ వాంజిక్ చికోపీ జాక్‌పాట్ కొట్టింది. ఆమె ఓ నర్స్.
వాషింగ్టన్: మసాచుసెట్స్‌కు చెందిన 53 సంవత్సరాల మావిస్ వాంజిక్ చికోపీ జాక్‌పాట్ కొట్టింది. ఆమె ఓ నర్స్. కానీ ఆమె కొన్న లాటరీ టిక్కెట్‌తో వేల కోట్ల రూపాయల జాక్ పాట్ కొట్టింది.
ఆమె మసాచ్యుసెట్స్‌లో ఓ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోంది. ఆమె రూ.4800 కోట్ల పైచిలుకు జాక్‌పాట్‌ను సొంతం చేసుకుని అమెరికా చరిత్రలోనే ఒకే టిక్కెట్‌పై అత్యంత అధిక మొత్తాన్ని గెలుచుకున్న వ్యక్తిగా నిలిచారు.

బుధవారం డ్రా తీశారు. ఆమెకు జాక్‌పాట్ వచ్చినట్లు గురువారం ప్రకటన వెలువడింది. ఇక తాను ఈ ఉద్యోగం చేయబోనంటూ ఆ తర్వాత ప్రకటించారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్తను ఇటీవలే కోల్పోయారు.












Click it and Unblock the Notifications