భారీ భూకంప విలయం: ఆప్ఘాన్‌లో 1000 దాటిన మరణాలు, 1500 మందికి గాయలు, పాక్‌లోనూ

కాబూల్: ఆప్ఘనిస్థాన్‌లో సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని నింపింది. బుధవారం తెల్లవారుజామున ఆఫ్ఘనిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలలో 6.1 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 1,000 మందికి పైగా మరణించారు, 1,500 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని ఖోస్ట్ నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీసీ) తెలిపింది. మరణాల సంఖ్య‌ మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

భూకంప తీవ్రతకు వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తాలిబన్ నాయకుడు హిబతుల్లా అఖుంద్జాదా తెలిపారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, భారతదేశంలోని దాదాపు 119 మిలియన్ల మంది ప్రజలు 500 కిలోమీటర్ల పరిధిలో ప్రకంపనలు అనుభవించారని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది.

Massive Earthquake in Afghanistan: Over 1,000 Dead, 1,500 Injured, Tremors Felt In Pakistan

ఆఫ్ఘన్ అత్యవసర అధికారి షరాఫుద్దీన్ ముస్లిం ఉదహరించిన ప్రకారం.. మరణాల సంఖ్య, 2002లో ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో 6.1 తీవ్రతతో సంభవించిన భూకంపం తర్వాత ఇది అత్యంత ఘోరమైన భూకంపం.

ఆఫ్ఘన్ మీడియా ఛాయాచిత్రాల్లో ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అత్యంత దారుణంగా దెబ్బతిన్న పక్తికాలో 90 ఇళ్లు ధ్వంసమయ్యాయని, డజన్ల కొద్దీ ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నారని భావిస్తున్నట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని బఖ్తర్ వార్తా సంస్థ నివేదించింది.

తూర్పు ఆఫ్ఘన్ ప్రావిన్స్ పక్తికాలో ఎక్కువ మరణాలు నమోదయ్యాయని అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారి సలాహుద్దీన్ అయూబీని ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. గయాన్‌లోని గ్రామం మొత్తం ధ్వంసమైందని స్థానిక మీడియా సైట్ ఎటిలాట్-ఇ రోజ్ నివేదించింది.

'తీవ్రమైన భూకంపం పాక్టికా ప్రావిన్స్‌లోని నాలుగు జిల్లాలను కదిలించింది. వందలాది మంది మన దేశస్థులు మరణించారు. డజన్ల కొద్దీ ఇళ్ళు ధ్వంసమయ్యారు" అని తాలిబాన్ ప్రభుత్వ డిప్యూటీ ప్రతినిధి బిలాల్ కరీమి ట్విట్టర్‌లో రాశారు. "మరింత విపత్తును నివారించడానికి వెంటనే ఆ ప్రాంతానికి బృందాలను పంపాలని మేము అన్ని సహాయ ఏజెన్సీలను కోరుతున్నాము' అని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+