Matt Race: 90 నిమిషాలు నిద్రపోతే రూ. 14 లక్షల బహుమతి.. ఎక్కడంటే..?

ప్రస్తుతం చాలా మంది యువత పనీ పాటా లేకుండా ఎప్పుడూ ఫోన్ చూస్తూ.. నిద్ర పోతూ గడిపేస్తుంటారు. అలా ఎప్పూడూ నిద్ర పోయో వారిని తల్లిదండ్రులు ఏదైనా పని చేసుకోమని తిడుతుంటారు. ఇక పొద్దొచ్చేదాకా నిద్ర పోవడం మనలో చాలా మందికి అలవాటే.. అయితే నిద్ర పోతే అక్కడ డబ్బులు ఇస్తారన్న సంగతి మీకు తెలుసా..? అవును కేవలం 90 నిమిషాలు నిద్రపోతే చాలు ఏకంగా రూ. 14 లక్షల బహుమతి గెలుచుకునే అవకాశం ఉంది. 90 నిమిషాల పాటు గాఢ నిద్రలో ఉంటే ఈ బహుమతి గెలుచుకోవచ్చు. టోక్యో నగరంలో Matt Race పేరుతో ఓ పరుపుల తయారీ కంపెనీ ఈ వింత‌ పోటీని నిర్వహిస్తోంది.

తాజాగా జరిగిన ఈ పోటీలో కాంపిటేటివ్ స్లీపర్స్ అని పిలుచుకునే డజన్ల కొద్దీ ఔత్సాహికులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలో భాగంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఓ గదిలో తక్కువ కాంతిలో.. సౌకర్యవంతమైన పరుపులపై వీళ్లంతా 90 నిమిషాలపాటు నిద్రపోయారు. అలాగే ప్రతి ఒక్కరి తలకు స్లీప్ ట్రాకింగ్ పరికరాలను కూడా అమర్చారు. దాంతో ఎవరు ఎంత వేగంగా నిద్రలోకి జారుకున్నారు..? ఎంత గాఢంగా నిద్రపోయారు..? అనే అంశాల ఆధారంగా విజేతను ఎంపిక చేశారు.

MattRace An innovative sleeping competition called is held in Japan win and get a prize of 14 lakh

ఇక జపాన్ ప్రజలు అధిక పని కారణంగా తీవ్రమైన నిద్రలేమితో బాధపడుతున్నారని.. వారిలో నిద్రపై అవగాహన పెంచేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని నిర్వాహక సంస్థ 'కోలా స్లీప్ జపాన్' క్రియేటివ్ డైరెక్టర్ రిచిరో నకమా పేర్కొన్నారు. జపాన్ ప్రజలు చాలా కష్టపడి పనిచేస్తారని.. నిద్రను ఇలా ఒక పోటీగా మార్చడం ద్వారా అందరూ కలిసి నిద్రించడం.. దానిపై ఆసక్తి పెంచుకోవడం సాధ్యమవుతుంద‌ని ఆయన తెలిపారు. ఇక ఈ నిద్ర‌ పోటీలో సుయిమీ అనే మహిళ విజేతగా నిలిచింది. అయితే అందుకు బహుమతిగా వచ్చిన డబ్బుతో తాను వేరుగా ఇల్లు తీసుకుంటానని పేర్కొంది. ప్రస్తుతం ఈ Matt Race సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+