Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భయపడిందే జరిగింది: ఉక్రెయిన్‌లో భారత విద్యార్థి మృతి: ఖార్‌కీవ్‌పై నిప్పుల వాన

వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతోన్న భీకర యుద్ధంలో ఇన్ని రోజులూ ఏదైతే జరగకూడదని భయపడుతూ వచ్చారో.. అది సంభవించింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక బలగాలు కురిపిస్తోన్న నిప్పులవానలో భారత విద్యార్థి ఒకరు మరణించారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం చేస్తోన్న దాడుల్లో భారత విద్యార్థి మృత్యువాత పడినట్లు తెలిపింది. ఆ విద్యార్థి కుటుంబంతో తాము సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది.

Recommended Video

    Russia Ukraine Conflict : PM Modi తో Volodymyr Zelensky కీలక చర్చలు! | Oneindia Telugu

    రెండో అతిపెద్ద నగరంపై దాడులు..

    రెండో అతిపెద్ద నగరంపై దాడులు..

    ఖార్‌కీవ్‌లో ఈ దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం.. ఖార్‌కీవ్. ఆ దేశ ఈశాన్య ప్రాంతంలో ఉంటుంది. రాజధాని కీవ్ తరువాత ఆ స్థాయిలో అతి పెద్ద నగరం ఇదే. అత్యంత సుందరంగా ఉండే నగరాల్లో ఇదీ ఒకటి. పార్కులు, బొటానికల్ గార్డెన్స్, ఖార్‌కీవ్ స్టేట్ అకడమిక్ ఒపెరా అండ్ బ్యాలె థియేటర్.. ఈ నగరానికి అదనపు హంగులను తీసుకొచ్చాయి. ఉక్రెయిన్ ఎడ్యుకేషనల్ హబ్‌గా దీన్ని పిలుస్తుంటారు.

    మరుభూమిగా ఖార్‌కీవ్..

    మరుభూమిగా ఖార్‌కీవ్..

    అలాంటి ఖార్‌కీవ్ నగరం.. ఇప్పుడు మరుభూమిగా మారింది. ఈ తెల్లవారు జాము నుంచీ రష్యా సైనిక బలగాలు ఈ నగరాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. పెద్ద ఎత్తున దాడులకు దిగాయి. రాకెట్లతో విరుచుకుపడ్డాయి. ఈ నగరంలో భారీ ఎత్తున కాల్పులు సంభవిస్తున్నట్లు ఖార్‌కీవ్ మేయర్ సైతం ధృవీకరించారంటే- అక్కడి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. రష్యా సైనికుల దాడుల్లో పలు భవనాలు నేలమట్టం అయ్యాయి. ఎటు నుంచి ఏ రాకెట్ వచ్చి వాలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

    భారత విద్యార్థి మృతి..

    ఇప్పుడు అలాంటి పరిస్థితులే ఓ భారతీయ విద్యార్థి మరణానికి దారి తీశాయి. రష్యా సైనికులు ఎడతెరిపి లేకుండా జరుపుతోన్న దాడుల సందర్భంగా ఆ విద్యార్థి మరణించారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌లోని భారత రాయబారి అరిందమ్ బాగ్చీ వెల్లడించారు. భారత్‌లోని ఆ విద్యార్థి కుటుంబానికి ఈ విషయాన్ని తెలియజేశామని అన్నారు. కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారాయన.

    అరిందమ్ బాగ్చీతో సంప్రదింపులు..

    ఈ సమాచారం తెలిసిన వెంటనే విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అరిందమ్ బాగ్చీకి ఫోన్ చేశారు. అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. రష్యాలోని భారత రాయబార కార్యాలయానికీ ఫోన్ చేశారు. ఏ క్షణం ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొని ఉన్నాయని, భారత విద్యార్థులు, పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించే కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలని సూచించారు. ఖార్‌కీవ్, ఇతర నగరాల్లో ఉన్న భారత విద్యార్థులకు ఎలాంటి ప్రాణాపాయం సంభవించకుండా స్వదేశానికి చేర్చాలని అన్నారు.

    భారత్‌లోని రష్యా, ఉక్రెయిన్ రాయబార కార్యాలయాలకు

    భారత్‌లోని రష్యా, ఉక్రెయిన్ రాయబార కార్యాలయాలకు

    భారత్‌లోని రష్యా, ఉక్రెయిన్ రాయబార కార్యాలయాలతోనూ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు సంప్రదింపులు జరిపారు. తమ దేశ పౌరులు, విద్యార్థుల భద్రతకు తాము అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, వారిని సురక్షితంగా తరలించడంలో సహకరించాల్సిందిగా సూచించారు. ఈ నెల 24వ తేదీన యుద్ధం ఆరంభమైనప్పటి నుంచీ తాము ఇదే విషయాన్ని పదేపదే పునరుద్ధాటిస్తూ వస్తున్నామని చెప్పారు.

    బెల్గొరొడ్‌లో అధికారులు..

    బెల్గొరొడ్‌లో అధికారులు..

    రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో గల బెల్గొరోడ్ నగరంలో ప్రత్యేకంగా భారత ప్రతినిధుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అటు వైపు నుంచి కూడా భారతీయులను స్వదేశానికి తీసుకుని రావడానికి గల అన్ని అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. బెల్గొరొడ్ సిటీ బోర్డర్ చెక్ పాయింట్ వద్ద అధికారులను మోహరింపజేసినట్లు సమాచారం. కాగా- ఇప్పటిదాకా ఉక్రెయిన్‌లో 9,000 మంది భారత పౌరులను సురక్షిత ప్రదేశాలకు తరలించినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది

    శశిథరూర్ దిగ్భ్రాంతి..

    ఖార్‌కీవ్‌లో భారత విద్యార్థి మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు శశిథరూర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏ మాత్రం ఊహించని ఘటనగా అభివర్ణించారు. ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకున్నానని చెప్పారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను యుద్ధ ప్రాతిపదికన స్వదేశానికి తీసుకుని రావాలని ఆయన కేంద్ర ప్భుత్వానికి విజ్ఞప్తి చేశారు. వారి కుటుంబాలు ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తోన్నాయని అన్నారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+