‘వన్నా క్రై’ వైరస్: 99 దేశాలను సైబర్ దాడి నుంచి కాపాడిన ఆ హీరో.. ఇతడే!

Posted By:
Subscribe to Oneindia Telugu

లండన్‌: శుక్రవారం నాటి హ్యాకర్ల 'వన్నా క్రై' ర్యాన్సమ్ వేర్ వైరస్ సైబర్ దాడి నుంచి ఒకట్రెండు కాదు.. ఏకంగా 99 దేశాలను కాపాడింది ఎవరో తెలుసా? ఓ 22 ఏళ్ల కుర్రాడు. అవును, అతడే మార్కస్‌ హచిన్స్‌.. కొన్ని లక్షల కంప్యూటర్లు ఈ వైరస్ బారిన పడకుండా రక్షించిన హీరో.

కిల్ స్విచ్ ను కనిపెట్టి సైబర్ దాడి నుంచి ప్రపంచంలోని కంప్యూటర్లను ఎవరో కాపాడారన్న వార్త అందరికీ తెలిసినా, దానిని ఎవరు రూపొందించారన్నది ఇప్పటివరకు సస్పెన్స్ గానే ఉంది.

ఇదిగో, ఈ విషయం ఇప్పుడు తెలిసిపోయింది. బ్రిటన్‌కు చెందిన మార్కస్‌ హచిన్స్‌ రాన్సమ్‌ వేర్‌ కిల్ స్విచ్‌ నొక్కాడు. సైబర్‌ ఎక్స్‌పర్ట్‌ అయిన ఇతడు తాను కిల్ స్విచ్‌ను ఎంత అనూహ్యంగా సృష్టించాడో సోమవారం ప్రపంచానికి వివరించాడు.

Meet Marcus Hutchins, the expert who discovered kill switch to slow WannaCry cyberattack

తాను వన్నాక్రై ర్యాన్సమ్ వేర్ కు సబంధించిన కోడ్ విశ్లేషిస్తూ ఉండగా అది ఒక అన్ రిజిస్టర్డ్ వెబ్ అడ్రెస్ కు లింక్ కావడాన్ని గమనించానని, దీంతో తాను వెంటనే దానిని రిజిస్టర్డ్ డొమైన్ గా మార్చానని, అదే సదరు వైరస్ వ్యాప్తి చెందకుండా కిల్ స్విచ్ గా మారిందని తెలిపాడు.

ఇక తన వివరాలు బయటికి వచ్చిన నేపథ్యంలో హ్యాకర్ల నుంచి తనకు ముప్పు పొంచి ఉందని కూడా మార్కస్‌ హచిన్స్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. ఏదో కాకతాళీయంగా తాను కిల్లర్ స్విచ్ ను రూపొందించాడేగానీ, మళ్లీ ఇలాంటి దాడి కనుక జరిగితే దాన్ని అడ్డుకోవడం చాలా కష్టమని వ్యాఖ్యానించాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A young British computer expert credited with cracking the WannaCry cyberattack told The Associated Press he doesn't consider himself a hero but fights malware because "it's the right thing to do." In his first face-to-face interview, Marcus Hutchins, who works for Los Angeles-based Kryptos Logic, said Monday that hundreds of computer experts worked throughout the weekend to fight the virus, which paralysed computers in some 150 countries. "I'm definitely not a hero," he said. "I'm just someone doing my bit to stop botnets."
Please Wait while comments are loading...