వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Mehul Choksi: భారతీయుడు కాదు: ప్రధాని సూచనపై సవాల్: అప్పగింతపై సుప్రీంకోర్టు జోక్యం..స్టే

|
Google Oneindia TeluguNews

సెయింట్ జాన్స్: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల మేర మోసగించి, దేశం వదిలి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు మేహుల్ చోక్సీ..ఆంటిగ్వా అండ్ బార్బుడాకు అప్పగింత విషయం అనూహ్య మలుపు తిరిగింది. ఈ నెల 24వ తేదీ సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన ఆయన ఆచూకీ డొమినికాలో తేలింది. ఇక అక్కడి నుంచి ఆయన మళ్లీ అంటిగ్వాకు చేరుకోవడానికి సాగించిన ప్రయత్నాలు.. చివరికి న్యాయస్థానానికి చేరాయి. అంటిగ్వాకు అప్పగించడంపై ఈస్టర్న్ కరేబియన్ దీవుల అత్యున్నత న్యాయస్థానం స్టే జారీ చేసింది. డొమినికా కాలమానం ప్రకారం..ఈ పిటీషన్‌పై విచారణ శుక్రవారం ఉదయం 9 గంటలకు చేపట్టనుంది.

 ఆర్థిక నేరస్తుడు మేహుల్ చోక్సి మిస్సింగ్: సముద్ర తీరంలో కనిపించిన కారు ఆర్థిక నేరస్తుడు మేహుల్ చోక్సి మిస్సింగ్: సముద్ర తీరంలో కనిపించిన కారు

నేరుగా భారత్‌కు

నేరుగా భారత్‌కు

మేహుల్ చోక్సీ ఉదంతంలో ఏకంగా అంటిగ్వా అండ్ బార్బుడా ప్రధానమంత్రి గ్యాస్టన్ బ్రౌనె జోక్యం చేసుకున్నారు. ఆయనను తమ దేశానికి పంపించ వద్దని, నేరుగా భారత్‌కు అప్పగించాలంటూ ఆయన డొమినికా ప్రధానమంత్రికి విజ్ఙప్తి చేశారు. ఆయనన స్వదేశానికి రప్పించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోందని గుర్తు చేశారు. బ్రౌనే- ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే మేహుల్ చోక్సీకి చెందిన అంటిగ్వా న్యాయవాది వేన్ మార్ష్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బ్రౌనే చేసిన ప్రకటనపై ఈస్టర్న్ కరేబియన్ ద్వీప దేశాల సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేశారు.

 పిటీషన్‌లో ఏముంది?

పిటీషన్‌లో ఏముంది?

మేహుల్ చోక్సీ.. ఏ దేశం నుంచి డొమినికాకు చేరుకున్నాడనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వేన్ మార్ష్ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఆయన ఆంటిగ్వా నుంచి వచ్చినందున.. ఆ దేశానికే అప్పగించాలని కోరారు. మేహుల్ చోక్సీ భారతీయుడు కాదని తన పిటీషన్‌లో స్పష్టం చేశారు. ఆయనకు ఆంటిగ్వా అండ్ బార్బుడా పౌరసత్వం ఉందని, ఆయనను ఆ దేశ పౌరుడిగానే గుర్తించాలని పేర్కొన్నారు. చోక్సీ భారతీయుడు కాదని తేల్చి చెప్పారు.

 చోక్సీని టార్చర్

చోక్సీని టార్చర్

ఆంటిగ్వా పౌరసత్వం ఉన్నందున.. ఆ దేశ రాజ్యాంగం, చట్టాలన్నీ చోక్సీ వర్తిస్తాయని, తమదేశ పౌరుడికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత అక్కడి ప్రభుత్వంపై ఉందని వాదించారు. దీన్ని విచారణకు స్వీకరించిన అక్కడి సుప్రీంకోర్టు.. అప్పగింత ప్రయత్నాలపై స్టే జారీ చేసింది. తదుపరి విచారణను శుక్రవారం నాటికి వాయిదా వేసింది. చోక్సీ శరీరంపై కొట్టిన, కాలిన గాయాలు ఉన్నాయని వేన్ మార్ష్ పేర్కొన్నారు. ఆయన కంటి మీద బలమైన గాయాలు ఉన్నాయని, కన్ను వాచిందని చెప్పారు.

Recommended Video

Nirav Modi Assets Seized : నీరవ్‌ మోదీ ఆస్తులు జప్తు చేసిన ED || Oneindia Telugu
డొమినికా పోలీసుల కస్టడీలోనే

డొమినికా పోలీసుల కస్టడీలోనే

శరీరంపై పలుచోట్ల కాలిన గాయాలు సైతం ఉన్నట్లు తనకు డొమినికా పోలీసులు వివరించినట్లు తెలిపారు. జాలీ హార్బర్ తీరం నుంచి 60-70 అడుగుల పొడవు ఉన్న ఓ వెస్సెల్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను అపహరించినట్లు నిర్ధారించారని చెప్పారు. చోక్సీని ఆంటిగ్వాకు అప్పగించబోతోన్నారంటూ మొదట్లో వచ్చిన వార్తలను డొమినికా పోలీసులు తోసిపుచ్చారు. ఆయన తమ కస్టడీలోనే ఉన్నారని స్పష్టం చేశారు. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం.. ఆయనను ఆంటిగ్వాకు అప్పగించట్లేదని వివరించారు. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ తమ ఆధీనంలోనే ఉంటారని పేర్కొన్నారు.

English summary
Eastern Caribbean Supreme Court, superior court for eastern Caribbean states including Commonwealth of Dominica, stays repatriation of fugitive diamantaire Mehul Choksi. The matter will be heard at 9 am on May 28.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X