ఫేస్‌బుక్ పేరు మారుతుందా? 28న జుకర్‌బర్గ్ కీలక ప్రకటన: కొత్త పేరేంటీ?
వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్.. వార్తల్లోకి ఎక్కింది. కొద్దిరోజులుగా తరచూ వార్తల్లో హాట్ టాపిక్ ఉంటూ వస్తోందీ టాప్ ప్లాట్‌ఫామ్. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి మార్క్ జుకర్‌బర్గ్ రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీన్ని ఫేస్‌బుక్ మేనేజ్‌మెంట్ తోసిపుచ్చిప్పటికీ.. ఆగట్లేదు. మరింత ఊపందుకుంటున్నాయి. ఈ నెల చివరివారంలో మార్క్ జుకర్‌బర్గ్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తారంటూ చెబుతున్నారు.

స్పందించని మేనేజ్‌మెంట్..
తాజాగా- ఫేస్‌బుక్‌కు సంబంధించిన మరో కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్ పేరు మారబోతోందనేది దాని సారాంశం. కొత్త పేరు కోసం మార్క్ జుకర్‌బర్గ్.. కీలక స్థాయిలో పని చేస్తోన్న ఉద్యోగులతో చర్చించినట్లు ది వెర్జ్ వెల్లడించింది. ఈ నెల 28వ తేదీన ఆయన ఓ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారని, ఇందులో కొత్త పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీనిపై తన స్పందనను తెలియజేయడానికి ఫేస్‌బుక్ యాజమాన్యం సుముఖత వ్యక్తం చేయలేదు. వదంతులకు స్పందించాల్సిన పని లేదని స్పష్టం చేసింది.

28న వార్షిక సమావేశం..
ఈ నెల 28వ తేదీన ఫేస్‌బుక్ వార్షిక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కనెక్ట్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించబోతోంది. మార్క్ జుకర్‌బర్గ్.. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ వార్షిక సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు, ప్రకటనలను చేస్తారని ది వెర్జ్ అంచనా వేసింది. ఈ సమావేశం కంటే ముందే కొత్త పేరును ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలిపింది. ఫేస్‌బుక్ అందుబాటులోకి వచ్చిన తరువాత.. చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.

మరింత విస్తృతం..
తోటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్, ఒకులస్, స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్.. వంటివి జత కలిశాయి. ఫేస్‌బుక్ వ్యాపార కార్యకలాపాల స్వరూపమే మారిపోయింది. సోషల్ మీడియాకు మించి.. అనే స్థాయికి చేరింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని- అదే స్థాయిలో ఈ బ్లూ యాప్‌ను మరింత అభివృద్ధి చేయాలని మార్క్ జుకర్‌బర్గ్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. దీనికి అనుగుణంగా తన బ్రాండ్ నేమ్‌ను కూడా మార్చుకోవాలనే నిర్ణయాన్ని ఆయన తీసుకున్నట్లు సమాచారం.

మెటావర్స్ కంపెనీగా..
మెటావర్స్ కంపెనీగా దీన్ని డెవలప్ చేయడానికి ఆయన కసరత్తు చేస్తోన్నారని ది వెర్జ్ తెలిపింది. వర్చువల్ రియాలిటీ, అగ్‌మెంటెడ్ రియాలిటీల్లో ఫేస్‌బుక్ భారీగా పెట్టుబడులు పెట్టింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లోనూ వేల కోట్ల రూపాయల మేర ఇన్వెస్ట్‌మెంట్ చేసింది. తన వ్యాపార కార్యకలాపాలను కొత్త కొత్త సెక్టార్లకు విస్తరించుకుంటోంది. ఈ నేపథ్యంలో బ్రాండ్ నేమ్ ఫేస్‌బుక్‌తోనే వెళ్లడం వల్ల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అనే ముద్ర పడుతుందని, దీన్ని చెరిపేసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొంది.
Recommended Video

అమెరికన్ కాంగ్రెస్ ఆంక్షలు..
ఫలితంగా దీన్ని మార్చి వేసి, ఓ యూనివర్సల్ పేరును పెట్టాలని జుకర్‌బర్గ్ భావిస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో- అమెరికన్ కాంగ్రెస్.. ఫేస్‌బుక్‌పై పలు ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. సెక్యూరిటీ బ్రీచ్, నకిలీ వార్తలను కట్టడి చేయడంలో విఫలం కావడం వంటి కొన్ని చర్యలు అమెరికన్ కాంగ్రెస్‌ను ఆగ్రహానికి గురి చేశాయి. ఫలితంగా- కఠిన ఆంక్షలను విధించింది. దీన్ని సైతం దృష్టిలో ఉంచుకుని ఫేస్‌బుక్ పేరును మార్చడంతో పాటు కొత్త తరహా కార్యకలాపాలను చేపట్టడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.
-
ఖమేనీ సంధి ఒప్పందం? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications