ఉగ్రవాదులకు మద్దతుగా హీరోయిన్ ట్వీట్..!
పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులకు, ఇజ్రాయిల్ దేశ సైనికులకు మధ్య యుద్దం జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఉగ్రవాదులు నైట్ పార్టీ జరుపుకుంటున్న సమయంలో మీద రాకెట్లతో ఇజ్రాయిల్ సైనికులు దాడి చేశారు. దీనిని తీవ్రమైన చర్యగా పరిగణించిన ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై దాడికి దిగారు. ఉగ్రవాదులకు సైనికులకు మధ్య భీకర యుద్దం జరుగుతుంది.

చిన్న పిల్లల్ని, మహిళలను అత్యంత పాశవికంగా హత్య చేసిన వీడియోలను ఉగ్రవాదులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.ఈ యుద్దంలో సామాన్య ప్రజలు సైతం కనుమూశారు. మరణాలపై పూర్తి లెక్కలు బయటకు రావడం లేదు. అయితే ఇలాంటి సమయంలో ఉగ్రవాదులకు మద్దతుగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి సంచలనం సృష్టించింది ఓ నటి.

నీలి చిత్రాల నటి మియా ఖలీఫా ఉగ్రవాదులను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌ను షేర్ చేసింది. హమాస్ ఉగ్రవాదులను మియా ఖలీఫా యోధులుగా అభివర్ణించింది. మియా ఖలీఫా అక్కడితో ఆగకుండా..దాడులకు సంబంధించిన వీడియోలు సరిగా కనిపించడం లేదని.. ఫోన్లను నిలువుగా కాకుండా.. అడ్డంగా పట్టుకొని వీడియోలు తీయమని ఉగ్రవాదులకు ఉచిత సలహాలు ఇస్తుంది.

ఉగ్రవాదులకు మద్దతుగా నిలబడకుంటే వర్ణ వివక్షతను సమర్థించినట్టే అంటూ మియా ఖలీఫా ట్వీట్ చేసింది. మియా ఖలీఫా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. మహిళలపై అత్యాచారాలు ,చిన్నపిల్లలను హత్య చేస్తున్న ఉగ్రవాదులకు మద్దతుగా ఉండడం ఏంటని మియా ఖలీఫాను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మియా ఖలీఫా చేసిన ట్వీట్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications