విమానంలో పిడిగుద్దులతో బీభత్సం: ఎమర్జెన్సీ ల్యాండింగ్(వీడియో)
గాలిలో ఉన్న విమానంలో ఇద్దరు ప్రయాణికులు పిడిగుద్దులతో ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు.
లండన్: గాలిలో ఉన్న విమానంలో ఇద్దరు ప్రయాణికులు పిడిగుద్దులతో ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఆ సమయంలో విమానం 30వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. దీంతో వెంటనే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. మిడిల్‌ఈస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బీరుట్ నుంచి లండన్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే.. జాష్ అనే పెద్ద వయసు వ్యక్తి విమానంలో తన భార్యపై, మరో ప్రయాణికుడిపై గట్టిగా అరుస్తూ దుర్భాషలాడాడు. తోటి ప్రయాణికుడిని పిడిగుద్దులు గుద్దాడు. అతడు కూడా తిరిగి కొట్టడంతో ఘర్షణకు దారితీసింది. దీంతో విమాన సిబ్బంది పరుగు పరుగున వచ్చి గొడవ సద్దుమణిగించేందుకు ప్రయత్నించగా వారి పట్ల కూడా అతడు దురుసుగా ప్రవర్తించాడు.

ఎయిర్‌హోస్టెస్ గట్టిగా కోప్పడి అతడిని నియంత్రించడానికి ప్రయత్నించగా ఆమె పట్ల కూడా చాలా దురుసుగా ప్రవర్తించాడు. ఈ గొడవతో పైలట్ విమానాన్ని అత్యవసరంగా ఇస్తాంబుల్‌లో దించేశారు.
నలుగురు సెక్యూరిటీ గార్డులు వచ్చి గొడవకు కారణమైన వ్యక్తిని విమానం నుంచి దించివేశారు. ఈ గొడవ బుధవారం జరిగింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీని యూట్యూబ్‌లో ఎవరో పోస్ట్ చేయగా ఇప్పుడు అది వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications