శ్వేత సౌధంలో ఒబామాతో నీనా దవులూరి భేటీ

వాషింగ్టన్: మిస్ అమెరికా కిరీటం దక్కించుకున్న తెలుగు అమ్మాయి నీనా దవులూరి బుధవారంనాడు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలిశారు. ఆమె శ్వేత సౌధంలో ఒబామాతో భేటీ అయ్యారు. మిస్ అమెరికా కిరీటం దక్కించుకున్న తొలి ఇండియన్ అమెరికన్ నీనా దవులూరి.
ఓవల్ కార్యాలయంలో అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మాట్లాడడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని నీనా దవులూరి అన్నారు. ఒబామాతో భేటీ తర్వాత ఆమె ఆ విధంగా ట్వీట్ చేశారు. పిల్లల మిరాకిల్ నెట్‌వర్క్ హాస్పిటల్ చాంపియన్స్ గౌరవార్థం మిస్ అమెరికా అధ్యక్షుడితో గ్రూప్ ఫొటోలో పాల్గొన్నట్లు శ్వేత సౌధం అధికార వర్గాలు చెప్పాయి.
గ్రూప్ ఫొటో తర్వాత ఓవల్ కార్యాలయాన్ని సందర్సించినట్లు ఆ వర్గాలు తెలిపారు. ఇటీవల భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌తో సమావేశం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నీనా దవులూరి గురించి ప్రస్తావించారు.
ప్రస్తుతం మిస్ అమెరికా ఇండియన్ అమెరికన్ అని ఆయన మన్మోహన్‌తో అన్నారు. సెప్టెంబర్‌లో జరిగిన పోటీల్లో దవులూరి మిస్ అమెరికాగా ఎన్నికయ్యారు. ఈ పోటీల్లో గెలిచిన తర్వాత నీనా దవులూరిపై జాతి వివక్ష వ్యాఖ్యలు వెలువడ్డాయి.












Click it and Unblock the Notifications