ఐసిస్‌లో చేరకుంటే ఎత్తుకెళ్తాం: మిస్ ఇరాక్‌కి బెదిరింపు
ఇరాక్: 'మిస్ ఇరాక్'కు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చాయి. నీవు ఐసిస్‌లో చేరకుంటే ఎత్తుకెళ్తామని బెదిరించారు. 1972 తర్వాత అంటే నలబై ఏళ్లు తర్వాత ఇటీవలే ఇరాక్‌లో తొలిసారి మిస్ ఇరాక్ పోటీలు జరిగాయి.
ఈ పోటీల్లో మిస్ ఇరాక్‌గా ఎంపికైన శయ్‌మా ఖాసిమ్‌కి ఐసిస్ నుంచి నుంచి బెదిరింపులు వచ్చాయి. మిస్ ఇరాక్‌గా ఎంపికైన కొద్ది గంటలకే... తనను వెంటనే ఐసిస్‌లో చేరాలని లేకుంటే కిడ్నాప్ చేస్తామని ఫోన్‌లో బెదిరించినట్లు ఆమె తెలిపింది.

అయితే తాను ఇలాంటి బెదిరింపులకు భయపడనని ఎన్ని అవాంతరాలు వచ్చినా తన బాధ్యతలు నెరవేరుస్తానని ఆమె చెప్పింది. ఆమె వయస్సు ఇరవై. ఈమె కిర్కుక్‌కు చెందిన యువతి. నలభై ఏళ్ల తర్వాత జరిగిన మిస్ ఇరాక్ పోటీల్లో ఆమె ఈ కిరీటం గెలుచుకుంది.












Click it and Unblock the Notifications