వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిస్ మార్వెల్: డిస్నీ నిర్మించిన తొలి ముస్లిం సూపర్ హీరో కథ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఇమాన్ వెల్లానీ

డిస్నీ విడుదల చేసిన తొలి ముస్లిం సూపర్ హీరో కథ మిస్ మార్వెల్‌ను విశ్లేషకులు ప్రశంసలతో ముంచెత్తారు.

పాప్ సంస్కృతి చరిత్రకు ఇదొక సంతోషకరమైన అధ్యాయాన్ని జత చేసిందని అన్నారు.

ఈ షో ఒక తెలివితేటలు గల టీనేజీ అమ్మాయి, ఎవెంజర్స్ కామిక్ బుక్ నటి కమలా ఖాన్ చుట్టూ తిరుగుతుంది.

ఈ పాత్రను పాకిస్తానీ మూలాలున్న కెనడాకు చెందిన అమ్మాయి ఇమాన్ వెల్లానీ పోషించింది.

ఆమె మార్వెల్ గా మారేందుకు అతీత శక్తులు వచ్చేవరకూ ఆ పాత్రలో ఇమిడేందుకు ఇబ్బంది పడుతుంది.

ఈ షోకు ఫైవ్ స్టార్ ఇచ్చిన గార్డియన్ రివ్యూలో "ఆమె నవ్విస్తూ, అందంగా, సునాయాసంగా అంచనాలను తారుమారు చేసింది" అని పేర్కొన్నారు.

"సాధారణంగా ఒక కొత్త యువ నటి ఎలా నటిస్తారోనని భయపడతారు. కానీ, వెల్లానీ చాలా సహజంగా నటించింది. ఆమెనొక సూపర్ హీరో అని తీరాల్సిందే. ఆమె మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్. అదే ఆమె భవిత అయి ఉంటుంది" అని గార్డియన్ టీవీ విమర్శకులు లూసీ మాన్ గన్ రాశారు.

ఆరు భాగాల డిస్నీ సిరీస్ లో ప్రస్తుతం రెండు భాగాలు అందుబాటులో ఉన్నాయి.

"ఈ రెండు భాగాలు ఆకర్షణీయంగా, నవ్విస్తూ, ప్రేమతో నిండి, విలక్షణంగా, నిజాయితీతో ఉన్నాయి" అని ఆయన రాశారు.

https://www.youtube.com/watch?v=m9EX0f6V11Y

1970ల నుంచి మార్వెల్ సూపర్ హీరోలు కామిక్ పుస్తకాల పేజీలు తిరగేస్తూ , టీవీ స్క్రీన్ లు చూస్తున్నారు. కానీ, ఇటీవల ఆ పాత్రలను విభిన్నంగా చేయాలనే ప్రయత్నాలు జరిగాయి.

ఈ సిరీస్ ప్రారంభంలో తనను పోలిన సూపర్ హీరో మరొకరు లేరని ఖాన్ అంటారు.

"ఈ ప్రపంచాన్ని జెర్సీ నగరానికి చెందిన బ్రౌన్ అమ్మాయిలు మాత్రమే కాపాడరు" అని అంటూ ఒక కళాకారిణిగా, వ్లాగర్ గా, అవెంజర్స్ సూపర్ ఫ్యాన్ గా ఉండటం పై దృష్టి పెడుతుంది.

కానీ, అతీత శక్తులున్నాయనే పేరున్న ఆమె తాతమ్మకు చెందిన పాత బ్రేస్ లెట్ ధరించగానే ఆమె పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి.

"కమల పాకిస్తానీ సంస్కృతి, దేశ విభజన వల్ల కలిగిన వేదనకు ఈ గాజుకున్న శక్తులు ముడిపడి ఉంటాయి" అని మాన్ గన్ అన్నారు.

ఇమాన్ వెల్లానీ

ది ఫైనాన్షియల్ టైమ్స్ ఈ సిరీస్ కు ఫోర్ స్టార్ రివ్యూ ఇచ్చింది. వెల్లానీ పాత్ర ఈ సాహస, సాంస్కృతిక కథలో దుష్ట శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతూ అందరినీ ఆకర్షిస్తుంది.

ఈ షో లో ఖాన్ ను ఒక సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తిగా చూపించినట్లు జర్నలిస్ట్ డాన్ ఈనవ్ వర్ణించారు. "పాప్ సంస్కృతి చరిత్రలో ఒక ప్రముఖమైన భాగాన్ని చూపించినట్లు ఆమె రాశారు.

"పాకిస్తాన్ మూలాలున్న కమలను ముస్లింగా చూడటం యాదృచ్ఛికం కాదు" అని ఆయన రివ్యూలో రాశారు.

"ఇటీవల విడుదల అయిన పిక్సర్ సినిమా మాదిరిగా ఈ సిరీస్ నవ్విస్తూ సున్నితంగా సంస్కృతిని పాటించే తల్లితండ్రులకు, తమ ఉనికి కోసం, సంస్కృతిలో కలవాలని తపించే పిల్లలకు మధ్యలో ఉండే సాంస్కృతిక అంతరాలను స్పృశించింది".

ఖాన్ 2014లో మొదటి సారి సోలో కామిక్ బుక్ సిరీస్ లో కనిపించారు. ఆమె మార్వెల్ సూపర్ హీరో కు అద్భుతమైన దృశ్య రూపం ఇచ్చారని రోలింగ్ స్టోన్ పత్రిక కొనియాడింది.

స్క్రీన్ పై టీన్ డ్రామా నేపథ్యంలో తొలి రెండు ఎపిసోడ్ ల లోనూ, ఆమె పాత్ర ఆకర్షణీయంగా ఉందని అలన్ సెపిన్ వాల్ రివ్యూ లో రాశారు. కానీ, స్ఫూర్తిదాయకంగా లేని ఆమె సూపర్ హీరో వర్ణనల పట్ల అనుమానాన్ని వ్యక్తం చేశారు.

"అయితే, అది మర్వెల్ కు సంబంధించిన షో అని చాలా సులభంగా మర్చిపోవచ్చు. ఇదే ఈ షో కు సంబంధించిన ఉత్తమమైన, దారుణమైన విషయం" అని రాశారు.

"ఈ షో లో మొదటి రెండు భాగాల్లోనూ కమలను, ఆమె కుటుంబం, స్నేహితులను పాత్రల్లో నిలిపేందుకు చాలా గట్టి ప్రయత్నాలు చేశారు" అని రాశారు.

"కుటుంబం, సమాజపు అంచనాలను పెంచుతూ కమలకు కొత్తగా వచ్చిన అద్వితీయ శక్తులు ఒక రూపకంగా పని చేశాయి" అని అన్నారు.

ఇమాన్ వెల్లానీ

ఆమె స్కూలు ఆఖరి రోజున జరిగిన కాస్టింగ్ కాల్‌లో ఈ పాత్ర లభించింది.

"అంచనాలను మార్చి, మన పై వేసిన ముద్రలను చెరిపేసి సొంత వ్యక్తిత్వంతో బయటకు రావడమే" ఈ షో ప్రధాన థీమ్ - అని ఆమె ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ కు చెప్పారు.

ఈ షోకు ముందు ఆమె పాకిస్తాన్ వారసత్వాన్ని పక్కన పెట్టి ఆ మూలాల నుంచి ఎలా బయటకు వచ్చిన విధానాన్ని వివరించారు.

ఆమె పాత్రకు ప్రాతినిధ్యం వహించేందుకు సినీ నిర్మాతలు చేసిన ప్రయత్నాల గురించి చెబుతూ, ఆమె పొగరుగా, సహనంతో కూడుకుని పిల్లల కోసం నిర్మించిన షో లా ఉందని మిస్ మర్వెల్ గురించి ది ఇండిపెండెంట్ పేర్కొంది.

"ఈ సినిమా తీసేందుకు వెనుక ఉన్న మంచి ఉద్దేశ్యాలను సమీక్ష చేసేందుకు నేనిక్కడ లేను. మార్వెల్ ఒక కమర్షియల్ సినిమా.

ఈ షో తీయడం వెనుక కొన్ని స్వార్ధపూరిత ఉద్దేశ్యాలు ఉన్నాయి కానీ, దక్షిణ ఆసియాకు చెందిన కళాకారులు ఒక ఉత్తమ స్థాయి ప్రాజెక్టును నిర్మించడంలో ప్రదర్శించిన కార్యదక్షతను చూడటం చాలా కొత్తగా ఉంది" అని నిక్ హిల్టన్ రాశారు.

ఈ సిరీస్‌ను బ్రిటిష్ పాకిస్తానీ కమేడియన్ బిషా కే అలీ రాశారు. బెల్జియన్ ద్వయం ఆదిల్, బిలాల్ దర్శకత్వం వహించారు.

"ఈ సిరీస్ మొత్తం దక్షిణ ఆసియా సంస్కృతి పై గాఢమైన ప్రేమతో నిండిపోయింది" అని అన్నారు.

"అయితే, ఇది సూపర్ హీరో సిరీస్‌లకు చెందుతుందా అనేదే నా సందేహం"

అయితే, ఇది సూపర్ హీరో విభాగంలోకే వస్తుందని ఎంపైర్ పత్రిక చెప్పింది. ఈ పత్రిక ఈ సిరీస్‌కు 4 స్టార్ రివ్యూ ఇచ్చింది.

హాస్యంతో కూడిన ఈ షో తేలికగా పిల్లలకు, పెద్దలకు కూడా నచ్చే విధంగా ఉందని డెస్టినీ జాక్సన్ రాశారు.

"కొన్ని సన్నివేశాలు ఇబ్బంది పెట్టినా కూడా కొన్ని పోల్చుకోగలిగే సన్నివేశాలను ఆనందించగలిగే వారికి ఈ సిరీస్ మంచి కాలక్షేపాన్ని ఇస్తుంది".

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Miss Marvel: The first Muslim superhero story to be produced by Disney
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X