వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Miss Universe 2019: జాతి వివక్షపై పోరాడిన యువతి జోజిబినీ తున్జీదే విశ్వసుందరి టైటిల్

|
Google Oneindia TeluguNews

ఏటా నిర్వహించే అందాల పోటీలు మిస్ యూనివర్శ్‌ 2019కిగాను విశ్వసుందరి కిరీటం దక్కించుకుంది సౌతాఫ్రికా నల్లకలువ జోజిబినీ తున్జీ. మిస్‌ యూనివర్శ్ ఫైనల్లో జోజిబినీ తున్జీతో పాటు మిస్ ప్యూర్టోరికో మాడిసన్ ఆండర్‌సన్‌ పోటీ పడ్డారు. ఇక సెకండ్ రన్నర‌ప్‌గా మిస్ యూనివర్శ్ మెక్సికో నిలిచారు. 2018 మిస్ యూనివర్శ్‌గా నిలిచిన కాట్రియోనా గ్రే తాజా విశ్వసుందరి జోజిబినీ తున్జీకి కిరీటం పెట్టారు. ఆదివారం జరిగిన ఈ అందాల పోటీల మెగా ఫైనల్‌కు వేదికగా నిలిచింది అట్లాంటా.అయితే భారత్‌కు చెందిన వర్తికా సింగ్ టాప్ టెన్‌కు చేరడంలో విఫలమైంది.

మిస్ యూనివర్శ్‌ విజేత జోజిబినీ తున్జీ

విశ్వసుందరిగా విజేతగా నిలిచిన 26 ఏళ్ల మిస్ సౌతాఫ్రికా జోజిబినీ తున్జీ త్సోలో ప్రాంతానికి చెందినది. దక్షిణాఫ్రికాలో నెలకొన్న జాతివివక్షపై పోరాడిన మహిళల్లో తున్జీ ఒకరు. సోషల్ మీడియా వేదికగా జాతివివక్షతను ప్రశ్నించడమే కాకుండా పెద్ద ఎత్తున్న క్యాంపెయినింగ్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు మహిళలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అలానే ఉండాలని పరితపించే వ్యక్తుల్లో తున్జీ ఒకరని మిస్ యూనివర్శ్ నిర్వాహకులు వెల్లడించారు.

మొత్తం 90 మంది కంటెస్టెంట్స్

మొత్తం 90 మంది కంటెస్టెంట్స్

2019 మిస్ యూనివర్శ్ ఫైనల్స్ ఆదివారం అట్లాంటా వేదికగా జరిగాయి. అమెరికాలోని జార్జియా రాష్ట్ర రాజధాని అట్లాంటా. మొత్తం 90 మంది పోటీదారులు టైటిల్ కోసం పోరాడారు. స్విమ్ సూట్, ఈవినింగ్ గౌన్‌లతో పాటు జడ్జీలు అడిగే ప్రశ్నలు ఉన్న మూడు రౌండ్లలో వీరు పోటీ పడ్డారు. ప్రశ్నల సమయంలో చివరి ప్రశ్నను జడ్జీలు సంధించారు. " నేటి బాలికలకు అత్యంత ప్రాధాన్యమైన అంశాన్ని నేర్పించాలంటే ఏమి నేర్పుతారు" అనేది జడ్జీల చివరి ప్రశ్న. ఇక ఈ సారి పోటీల్లో ఆడియెన్స్‌ జడ్జీలకు సందేశం ఇచ్చే అవకాశాన్ని కంటెస్టెంట్స్‌కు కల్పించారు. ఇలా అవకాశం ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపిన ఓప్రా విన్‌ఫ్రే

ఫైనల్స్ సందర్భంగా టాప్ ఫైవ్‌లోకి మెక్సికో, కొలంబియా, ప్యూర్టోరికో, థాయ్‌లాండ్, సౌతాఫ్రికా దేశాలు ప్రవేశించాయి. వీరిలో విశ్వసుందరి కిరీటం మాత్రం మిస్ సౌతాఫ్రికా జోజిబిని తున్జీకి దక్కింది. ఆమె మిస్ యూనివర్శ్‌గా కిరీటం దక్కించుకోగానే ప్రముఖ వ్యాఖ్యాత ఓప్రా విన్‌ఫ్రే ట్విటర్‌ ద్వారా అభినందించారు. నేటి బాలికలకు నాయకత్వ లక్షణాలను నేర్పించాలన్న జోజిబినీ సమాధానం తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పింది. అంతేకాదు బాలికల కోసం లీడర్షిప్ అకాడమీని సందర్శించాలంటూ జోజిబినీకి ఆహ్వానం పలికారు ఓప్రా విన్‌ఫ్రే.

English summary
This year's Miss Universe crown has been won by South Africa's Zozibini Tunzi. 26-year-old Zozibini defeated Miss Universe Puerto Rico to win the crown. India's Vartika Singh couldn't make it to the top 20.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X