టైటానిక్ సబ్ మెరైన్ కథ దుఖాంతం- సముద్ర గర్భంలో 4,000 అడుగుల లోతున
వాషింగ్టన్: టైటానిక్ మినీ జలాంతర్గామి కథ దుఖాంతమైంది. మహా సముద్రంలో గల్లంతయిన ఈ సబ్ మెరైన్ శిథిలాలను అమెరికన్ కోస్ట్ గార్డ్ గుర్తించారు. టైటానిక్ టూరిస్ట్ సబ్ మెర్సిబుల్ కోసం వారు సాగించిన అన్వేషణకు బాధాకరమైన ముగింపు పడింది. అందులో ఉన్న వారు ఏమయ్యారనేది ఇంకా తెలియరావట్లేదు. వారందరూ మరణించి ఉండొచ్చని అనుమానిస్తోన్నారు. దీన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
న్యూఫౌండ్‌ల్యాండ్ అండ్ లాబ్రడార్ తీరం సమీపంలో నార్త్ అట్లాంటిక్- లాబ్రడార్ సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక శకలాలను తిలకించడానికి ప్రవేశపెట్టిన మినీ జలాంతర్గామి అది. టైటానిక్ టూరిస్ట్ సబ్ మెర్సిబుల్ రూపంలో దీన్ని నడిపించే ప్రయత్నాలకు తెర తీసిన విషయం తెలిసిందే. మొత్తం నలుగురు ఈ సబ్ మెరైన్‌లో టైటానిక్ శకలాలను తిలకించడానికి బయలుదేరి వెళ్లారు.

స్టాక్టన్ రష్ వ్యవస్థాపకుడు, బ్రిటన్‌కు చెందిన బిలియనీర్ హమీష్ హ్యార్డింగ్, ప్రఖ్యాత ఫ్రెంచ్ డైవర్ పాల్-హెన్రీ నర్గెయోలెట్, పాకిస్తాన్‌కు చెందిన వ్యాపారవేత్త షెహజాదా దావూద్, అతని 19 సంవత్సరాల కుమారుడు సులేమాన్ దావూద్ ఇందులో ప్రయాణించారు. మొట్టమొదటి టైటానిక్ టూరిస్టులుగా ఈ ఆదివారం సముద్రగర్భానికి బయలుదేరి వెళ్లారు.
ఇందులో 96 గంటలకు సరిపడేలా ఆక్సిజన్‌ను నింపారు. సముద్రంలోకి దిగినప్పటి నుంచి 96 గంటలు అంటే గురువారం ఉదయం వరకూ ఆక్సిజన్ నిల్వ ఉంటుంది. అమెరికాలోని మసాచుసెట్స్ స్టేట్‌లోని కేప్ కాడ్ తీరానికి 900 నాటికన్ మైళ్ల దూరంలో పోలార్ ప్రిన్స్ ఐస్ బ్రేకర్ రీసెర్చ్ షిప్ నుంచి ఇది తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. బయలుదేరిన 105 నిమిషాల తరువాత ఈ సబ్ మెరైన్‌తో కాంటాక్ట్ తెగిపోయాయి. రాడార్ స్క్రీన్‌పై నుంచి అది అదృశ్యమైంది.
అప్పటి నుంచి దీని జాడ కోసం అమెరికా, బ్రిటన్ కోస్ట్ గార్డ్స్ విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. 96 గంటలకు సరిపడేలా ఆక్సిజన్ నిల్వలు అడుగంటేలోపే గుర్తిస్తారని భావించారంతా. అది సాధ్య పడలేదు. గురువారం మధ్యాహ్నం దీని శకలాలను గుర్తించారు. సముద్ర ఉపరితలం నుంచి 4,000 మీటర్ల లోతున ఈ సబ్ మెరైన్ శకలాలను గుర్తించినట్లు యూఎస్‌సీజీ నార్త్ ఈస్ట్ కోస్ట్ గార్డ్స్ తెలిపారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.
రిమోట్లీ ఆపరేటెడ్ అండర్ వాటర్ వెహికల్ సహాయంతో వీటిని గుర్తించామని చెప్పారు. ఈ శకలాలు సబ్ మెరైన్‌కు చెందినవేనని ప్రాథమికంగా నిర్ధారించామని, దీనికి సంబంధించిన పూర్తి సాంకేతిక వివరాలను ఇంకా తెలుసుకోవాల్సి ఉందని అన్నారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు అవి సబ్ మెరైన్‌కు చెందినవేననే నిర్ణయానికి వచ్చామని, అందులో ఉన్నవారు ఏమైపోయారనే విషయంపై ఆరా తీస్తోన్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications