వేర్వేరు కంపెనీల కరోనా వ్యాక్సిన్లు వేసుకుంటే ఏమౌతుంది?: డబ్ల్యూహెచ్ఓ ఫుల్ క్లారిటీ

జెనీవా: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. భారత్ సహా అన్ని దేశాలు వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేశాయి. రెండు డోసుల వ్యాక్సిన్లను తీసుకున్న వారు మాస్కుల్లేకుండా తిరగొచ్చంటూ అమెరికా ఇదివరకే అధికారికంగా ప్రకటించినప్పటికీ- థర్డ్‌వేవ్ ముప్పును పరిగణనలోకి తీసుకుని ముందుజాగ్రత్త చర్యలను పాటిస్తోంది. భారత్‌లో వ్యాక్సినేషన్ ముమ్మరం సాగుతోంది. ఇప్పటిదాకా సోమవారం నాటి బులెటిన్ ప్రకారం.. కోవిడ్ వ్యాక్సిన్లను తీసుకున్న వారి సంఖ్య 37,73,52,501.

పలు ఫార్మాసూటికల్స్ కంపెనీలు అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్లను వినియోగమౌతోన్నాయి. ఫైజర్, మోడెర్నా, కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వీ, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ల వినియోగానికి ఆయా దేశాలు అనుమతి ఇచ్చాయి. వేర్వేరు కంపెనీలు అభివృద్ధి చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్లను మిక్సింగ్‌గా తీసుకోవడం వల్ల ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయనే విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ విస్పష్టమైన ప్రకటన చేసింది. ఒక వ్యక్తి.. రెండు వేర్వేరు కంపెనీలకు చెందిన కోవిడ్ వ్యాక్సిన్ల మిక్సింగ్.. మ్యాచింగ్ ప్రమాదకరమని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ హెచ్చరించారు.

mixing, matching Covid19 Vaccines is Dangerous trend: WHOs Soumya Swaminathan warns

వ్యాక్సిన్ల మిక్సింగ్ అండ్ మ్యాచింగ్ వల్ల సానుకూల ప్రభావం ఉందనడానికి తమ వద్ద ఎలాంటి డేటా గానీ, సాక్ష్యాలు గానీ లేవని ఆమె తేల్చి చెప్పారు. మిక్సింగ్ అండ్ మ్యాచింగ్‌ను డేంజరస్ ట్రెండ్‌గా అభివర్ణించారు. మున్ముందు థర్డ్ డోస్, ఫోర్త్ డోస్ వ్యాక్సిన్లను తీసుకోవాల్సిన అవసరం రావొచ్చని, అలాంటి పరిస్థితుల్లో ఎవరు, ఏ వ్యాక్సిన్ వేసుకుంటారో తెలియని పరిస్థితులు ఉత్పన్నమౌతాయని చెప్పారు. ఉద్రిక్త పరిస్థితులకు ఇది దారి తీస్తుందని సౌమ్య స్వామినాథన్ అంచనా వేశారు. అదే సమయంలో డబ్ల్యూహెచ్ఓ మానవ జీనోమ్ ఎడిటింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. దీన్ని రిజిస్టర్ చేయాలని సూచించింది.

Recommended Video

    Importance Of Jeepneys In The Philippines, జీప్ డ్రైవర్ లైఫ్ ఇదీ || Oneindia Telugu

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+