ఎదురెదురుగా మోదీ- షెహబాజ్..! పులిని చూసి నక్క హడల్..!

ఏప్రిల్ 22 న జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై క్షిపణులతో దాడులు చేసింది.

ఈ దాడుల్లో ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేయడమే కాకుండా వందలాది మంది టెర్రరిస్టులను హతమార్చినట్లు రక్షణ శాఖ పేర్కొంది. అంతేకాక పాకిస్థాన్ పై భారత్ కఠిన ఆంక్షలు అమలు చేసింది. సింధూ నదీ జలాల పంపిణీ నిలిపివేత, అటారీ- వాఘా బోర్డర్ మూసివేత, ఇరు దేశాల మధ్య వాణిజ్యం రద్దు, వీసాల జారీ రద్దు, గగనతలం మూసివేత.. తదితర నిర్ణయాలతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై దెబ్బ కొట్టింది. ఈ క్రమంలో భారత్- పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ క్రమంలో తొలిసారి భారత్- పాకిస్థాన్ దేశాధినేతలు ఎదురుపడే సమయం వచ్చింది. చైనాలో జరగనున్న SCO సమావేశం ఇందుకు వేదిక కానుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో తియాంజిన్ వేదికగా జరిగే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు (SCO) జరగనుంది. ఈ ఈ సమావేశంలో ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. జపాన్ లో పర్యటన అనంతరం చైనాలోని తియాంజిన్ కు చేరుకున్నారు ప్రధాని మోదీ. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సమావేశంలో భాగంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సహా పలువురు కీలక నేతలతో ప్రధాని మోదీ భేటీ కానున్నారు.

Modi and Shehbaz Face Off at SCO Summit in Tianjin Post India-Pakistan War

ఇప్పటికే చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌ తో సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం ఆధారంగా చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు ముందుకు తీసుకెళ్లేందుకు భారత్​ కట్టుబడి ఉందన్నారు. సరిహద్దు నిర్వహణపై భారత్, చైనా ప్రత్యేక ప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని మోదీ స్పష్టం చేశారు. షాంఘై సహకారం సంస్థ (SCO)కు చైనా విజయవంతంగా అధ్యక్షత వహించినందుకు జెన్ పింగ్ కు మోదీ అభినందనలు తెలిపారు.

మరోవైపు SCO సమావేశానికి హాజరయ్యేందుకు ఇప్పటికే పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చైనాలోని తియాంజిన్ నగరానికి చేరుకున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ, షెహబాజ్ షరీఫ్ ఎదురుపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వీళ్లిద్దరూ సంభాషించుకుంటారా..? లేదా అని ఆసక్తి నెలకొంది. ప్రపంచ మీడియా చూపు ఇప్పుడు ఈ ఇద్దరి నేతలపైనే పడింది. చైనా నిర్వహిస్తున్న ఈ సమావేశానికి ప్రపంచవ్యాప్తంగా 20 కు పైగా దేశాలు పాల్గొననున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+