నేపాల్‌లో అక్కడి పొలిటీషయన్స్ కంటే నరేంద్ర మోడీయే పాపులర్!
ఖాట్మాండు: నేపాల్‌లో భారత ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీయే అత్యంత పాపులర్ నేతనట! ఓ ఒపీనియన్ పోల్‌లో ఇది వెల్లడైంది. నేపాల్‌లో స్థానిక రాజకీయ నాయకుల కంటే మోడీయే ముందు ఉన్నట్లు సదరు పోల్‌లో వెల్లడైంది. నేపాల్ ప్రధాని రామ్ భరణ్ యాదవ్ కంటే ఏడు పాయింట్లు మోడీ ఎక్కువగా కలిగి ఉన్నారు.
వంద పాయింట్ల లెక్కన ఈ సర్వే జరిగింది. వంద పాయింట్లకు గాను భారత ప్రధాని మోడీకి 68 పాయింట్లు రాగా, నేపాల్ ప్రధాని రామ్ భరణ్ యాదవ్‌కు 61 పాయింట్లు వచ్చాయి. ఖాట్మాండుకు చెందిన రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ ఫర్మ్ ఐడీఏ ఆదివారం ఈ పోల్‌ను విడుదల చేసింది.
ఐడీఏ 2004 నుండి పోల్ కండక్ట్ చేస్తోంది. అయితే, తమ నేపాల్ దేశం నుండి కాక ఇతర దేశాల నాయకులను ఇందులోకి తీసుకోవడం ఇదే మొదటిసారి.

నేపాల్ రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని అమలుపర్చడంలో విఫలమయ్యారని, అదే సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం భారత ప్రజల ఆకాంక్షలను తీర్చి దేశలో వెళ్తున్నారని ఐడీఏ ప్రతినిధి ఒకరు చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోడీ గత ఏడాది ఆగస్టులో నేపాల్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. స్థానికులను ఆయన నేపాల్‌లో మాట్లాడి అలరించారు. పార్లమెంటులో ఏడు నిమిషాల పాటు ఆయన ప్రసంగించారు. రోడ్డు పైన స్థానికులతో కలిసిపోయారు. ఈ పోల్‌లో వేలాదిమంది పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications