వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ముందు నవాజ్ షరీఫ్ వెలవెల: పాకిస్తాన్ డైలీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో చేసిన ప్రసంగం ముందు పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రసంగం వెలవెలబోయిందని పాకిస్తాన్ దిన పత్రిక 'డైలీ టైమ్స్' పేర్కొంది. ఈ మేరకు 'మోడీ ఎట్ ద యూఎన్' పేరిట సంపాదకీయం రాసింది.

మోడీ ఐక్యరాజ్య సమితిలో ప్రసంగం ద్వారా పాశ్చాత్య దేశాల్లో తన హవాను మరింత దూకుడుగా కొనసాగించారని అభిప్రాయపడింది. ఆకట్టుకోవడంలో భారత ప్రధానిదే పైచేయిగా కనిపించిందని, నవాజ్ షరీఫ్ ఆ విషయంలో విఫలమయ్యారని విమర్శించింది.

Modi overshadowed Nawaz Sharif at UN: Pakistani daily

నాటి విషయాలను స్పృశిస్తూ నరేంద్ర మోడీ ప్రసంగం ఆరంభించారని, సంస్కృతిని ప్రతిబింబించేలా ఉపన్యాసం సాగించారని డైలీ టైమ్స్ పేర్కొంది. వాడివేడి చర్చలకు ఐరాస వేదిక కాదన్న విషయం గుర్తెరిగిన మోడీ, భారత్ ప్రతిష్ఠతో పాటు తన వ్యక్తిగత ప్రతిష్ఠను పెంచుకునే విధంగానే మాట్లాడారని అభిప్రాయపడింది.

ఒక విధంగా అదే సరైన పంథా అని కొనియాడింది. కానీ, షరీఫ్ మాత్రం సీరియస్ అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావించారని విమర్శించింది. మోడీ ప్రదనంగా పేదరిక నిర్మూలన, తీవ్రవాదం, మేడప్ ఈ మూడింటి పైనే మోడీ ప్రధానంగా దృష్టి సారించారని పేర్కొంది. మోడీ తన రాజకీయ చతురత ప్రదర్శించారని పేర్కొంది.

English summary
Prime Minister Narendra Modi's speech at the UN was everything his Pakistani counterpart Nawaz Sharif's was not, said a Pakistani daily on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X