శాలువాకు నవాజ్ ప్రతి బహుమతి: మోడీ తల్లికి చీరె
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత ప్రధాని నరేంద్ర మోడీ తల్లికి చీరను బహుమతిగా పంపించారు. నవాజ్ షరీప్ తల్లి కోసం మోడీ శాలువాను బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. గురువారం షరీఫ్ మోడీ తల్లికి చీరెను పంపించారు.
నవాజ్ షరీఫ్ చీరెను పంపిన విషయాన్ని మోడీ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. నవాజ్ షరీఫ్ తన తల్లి కోసం అద్భుతమైన తెల్లటి చీరెను పంపించారని, షరీఫ్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నానని, ఆ చీరెను త్వరలో తన తల్లికి పంపిస్తానని మోడీ చెప్పారు.

నవాజ్ షరీఫ్ మోడీ ప్రమాణ స్వీకారానికి ఇటీవల భారత్ వచ్చిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లే సమయంలో తల్లికంటూ షరీఫ్‌కు మోడీ బహుమతిగా శాలువాను ఇచ్చారు. దానికి నవాజ్ షరీఫ్ కూతురు మార్యాం నవాజ్ షరీఫ కృతజ్ఞతలు చెప్పారు.
తమ నానమ్మకు నరేంద్ర మోడీ అందమైన శాలువాను పంపినందుకు ధన్యవాదాలని ఆమె ట్వీట్ చేశారు. తన తండ్రి వ్యక్తిగతంగా తమ నానమ్మకు శాలువా ఇచ్చారని ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications