మోడీ టూర్‌పై అమెరికా, సమాధానం చెప్తామని ప్రధాని
వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన విజయవంతమైందని అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రభుత్వానికిచెందిన కీలక పరిపాలన అధికారులు వెల్లడించారు. పర్యటన అత్యంత విజయవంతమైనదని, ఇక పలు విధాన నిర్ణయాలు అమలు చేయాల్సి ఉందన్నారు.
భారత్‌లో పెట్టుబడులకు తగిన వాతావరణం కల్పించడానికి కొత్త ప్రభుత్వానికి ఇది తగిన సమయమని వెల్లడించారు. వాగ్ధానాలు అమలు చేయడమే ఇక కీలకమన్నారు. ఫలితాలు అనుకూలంగా ఉంటాయని అధికారులు మైక్రో ఫ్రోమాన్, ఫెన్నీ ప్రిట్జకర్ తెలిపారు.
మోడీ అమెరికా పర్యటన అమెరికా - భారత్‌ల మధ్య మరింత సన్నిహిత సంబంధాలకు అవకాశం ఏర్పడిందని భారత్ అంబాసిడర్ జయశంకర్ అన్నారు. ఇరు దేశాల మధ్య మరింత మెరుగైన సంబంధాల పైన ఎలాంటి అనుమానం అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

బీజేపీని కోరుకుంటున్నారు: వెంకయ్య
ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఢిల్లీలో అన్నారు. హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటు అనైతికంగా జరిగిందని, ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ద్రవ్యోల్భణం 10.6 నుండి మూడు శాతానికి పడిపోయిందని, ధరలు కూడా తగ్గాయన్నారు.
విపక్షాలు నిరాశతో ప్రధాని నరేంద్ర మోడీ పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. సరిహద్దులో సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే.. కాంగ్రెస్ నేతలు ఈ సమస్యను రాజకీయం చేయడం తగదన్నారు.
కాంగ్రెస్ హయాంలో జరిగిన సంఘటలనకు గుర్తు చేసుకోవాలన్నారు. మోడీ పైన ప్రజలకు భరోసా ఉందని తెలిపారు. ప్రజలు వారి భవిష్యత్తు ప్రధాని చేతిలో భద్రంగా ఉంటుందని విశ్వసిస్తున్నారని వెంకయ్య నాయుడు చెప్పారు.
ఒమర్ ప్రత్యామ్నాయాలు
కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాకిస్తాన్ తెగబడుతున్న దుశ్చర్యలకు సామాన్య ప్రజలు బలి కాకుండా ఉండేందుకు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారు. పాక్ సరిహద్దు వెంట ఉన్న గ్రామాల్లో కమ్యూనిటీ బంకర్లను నిర్మించడం ద్వారా సామాన్యులను కాల్పుల బారి నుంచి రక్షించవచ్చని భావించారు.
సరిహద్దు వెంట ఉన్న గ్రామాల్లో కమ్యూనిటీ బంకర్లను నిర్మించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎప్పుడైనా పాక్ కాల్పుల శబ్ధం వినిపిస్తే, గ్రామంలోని వారంతా సదరు బంకర్‌లో తలదాచుకుని ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. కాగా, దుస్సాహసం మానుకోవాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నరేంద్ర మోడీ గురువారం పాకిస్తాన్‌ను తీవ్రంగా హెచ్చరించిన విషయం తెలిసిందే. మా జవాన్లరు తుటాలతో సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications