అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కు ఇరాన్ సీనియర్ సైనిక సలహాదారు మొహ్సేన్ రెజాయీ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఒకవేళ అమెరికా ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే.. తమ ప్రతీకారం 'కంటికి కన్ను' పద్ధతిలో కాదని, 'కంటికి తల' తో సమానంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ హెచ్చరికలు అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచాయి.

మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇరు దేశాల మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి చర్చలు జరుగుతున్నాయని ప్రకటించారు. అయితే, ఇరాన్ సీనియర్ సైనిక అధికారి.. అమెరికాను స్తంభింపజేస్తామని, ఆ దేశ నౌకలను అరేబియన్ గల్ఫ్‌లో ముంచివేస్తామని బెదిరించడం ఈ అనిశ్చితికి మరింత ఆజ్యం పోసింది. తాజాగా వస్తున్న కథనాల ప్రకారం.. మొహ్సేన్ రెజాయీ ఇరాన్ ప్రభుత్వ మీడియాకు ఇచ్చిన టెలివిజన్ ఇంటర్వ్యూలో ఈ హెచ్చరికలు చేశారు. "మీరు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే, మా ప్రతీకారం ఇకపై కంటికి కన్ను కాదు, కంటికి తల అవుతుంది" అని రెజాయీ గట్టిగా నొక్కి చెప్పారు.

అంతేకాకుండా, "అమెరికాను రక్షించడానికి చివరి గడువులు దగ్గరపడుతున్నాయి" అని, "ఈ చిక్కుముడి నుండి యునైటెడ్ స్టేట్స్‌ను కాపాడటానికి ఎక్కువ సమయం లేదు" అంటూ ట్రంప్‌కు ఒక గడువును కూడా ఆయన పరోక్షంగా సూచించారు. దేశాన్ని స్తంభింపజేస్తామని, అరేబియన్ గల్ఫ్‌లో అమెరికా నౌకలను ముంచివేస్తామని రెజాయీ హెచ్చరించారు. అమెరికాను ఈ యుద్ధంలోకి ఇజ్రాయెల్ లాగిందని, 'గొప్ప ఇజ్రాయెల్' హామీతో ఇజ్రాయెల్ ప్రభుత్వం ట్రంప్ పరిపాలనను ప్రేరేపించిందని రెజాయీ ఆరోపించారు. ఇప్పుడు ట్రంప్ తన సొంత సైనిక కమాండర్లకు, ఇజ్రాయెల్‌కు మధ్య గందరగోళంలో ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ కొన్ని షరతులను కూడా విధించింది. ఇందులో అన్ని ఆంక్షలను ఎత్తివేయడం, నష్టాలకు పరిహారం చెల్లించడం, ఇరాన్‌పై మళ్లీ దాడి జరగదని అంతర్జాతీయ చట్టపరమైన హామీ ఇవ్వడం వంటివి ఉన్నాయి. దీనికి ఒక రోజు ముందు, ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ ఫారమ్‌ లో ఒక పోస్ట్ చేశారు. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య గత రెండు రోజులుగా "చాలా మంచి సంభాషణలు" జరుగుతున్నాయని, ఈ వివాదానికి "పూర్తి, సమగ్ర పరిష్కారం" లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై జరగాల్సిన అన్ని ప్రణాళికాబద్ధమైన దాడులను ఐదు రోజుల పాటు నిలిపివేయాలని తాను అమెరికా సైన్యానికి ఆదేశించినట్లు ట్రంప్ తెలిపారు. "ఈ లోతైన, సవివరమైన, నిర్మాణాత్మక సంభాషణల స్వరూపం, ధోరణి ఆధారంగా, ఈ వారం అంతటా కొనసాగే ఈ సంభాషణల నైపథ్యంలో, ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై ఎలాంటి దాడులనైనా ఐదు రోజుల పాటు వాయిదా వేయాలని నేను రక్షణ విభాగానికి సూచించాను" అని ట్రంప్ రాశారు.

అయితే, ఇరాన్ అధికారులు వాషింగ్టన్‌తో ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష చర్చలు జరగడం లేదని పదునుగా ఖండించారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగెర్ ఘాలిబాఫ్ X లో "అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని" పోస్ట్ చేశారు. ఈ నివేదికలు చమురు, ఆర్థిక మార్కెట్లను తారుమారు చేయడానికి ఉపయోగపడుతున్న "తప్పుడు వార్తలు" అని ఆయన కొట్టిపారేశారు.

MohsenRezaei to Trump Infrastructure Attacks Will Meet a Head for an Eye Retaliation Iran US

"ఇరాన్ ప్రజలు ఆక్రమణదారులకు పూర్తి, పశ్చాత్తాపంతో కూడిన శిక్షను డిమాండ్ చేస్తున్నారు" అని ఘాలిబాఫ్ రాశారు. "ఈ లక్ష్యం సాధించే వరకు ఇరాన్ అధికారులు తమ సుప్రీం నాయకుడికి, ప్రజలకు గట్టిగా మద్దతుగా నిలుస్తారు" అని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ నిజమైన ఒప్పందం చేసుకోవాలనే కోరికతో కాకుండా, ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయంతో వెనకంజ వేశారని ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆరోపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+