• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాగా ఉక్కపోస్తోంది..బట్టలు విప్పేసి, దిగేటప్పుడు వేసుకోవచ్చా? విమాన సిబ్బందికి అనుమతి అడిగిన మహిళ

|

మాంఛెస్టర్: బాగా ఉక్కపోస్తోంది..బట్టలు విప్పేసి, దిగేటప్పుడు వేసుకోవచ్చా?.. సుమారు 30 సంవత్సరాల వయస్సున్న ఓ మహిళా ప్రయాణికులు వేసిన ఈ ప్రశ్నకు ఎయిర్ హోస్టెస్ సహా ఇతర విమాన సిబ్బంది బిక్కమొహం వేశారు. మాంఛెస్టర్ నుంచి ఫ్యూర్టెవెంచురాకు వెళ్తోన్న థామస్ కుక్ సంస్థకు చెందిన విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళా ప్రయాణికురాలు అడిగిన ప్రశ్న నుంచి తేరుకోవడానికి విమాన సిబ్బందికి చాలా సమయం పట్టింది. ఆమెకు సమాధానం ఇవ్వడానికి వాళ్లు తడుముకోవాల్సి వచ్చింది.

నటాలియా వీన్ అనే మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి మాంఛెస్టర్ లోని ఓల్డ్ హ్యామ్ లో నివసిస్తున్నారు. ఆమె తన స్నేహితురాలితో కలిసి ఫ్యూర్టెవెంచురాకు ప్రయాణించాల్సి వచ్చింది. దీనికోసం థామస్ కుక్ విమానంలో టికెట్లను బుక్ చేసుకున్నారు. పెట్టే, బేడా సర్దుకుని విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడిదాకా బాగానే ఉంది. నిర్దేశిత లగేజీ కంటే ఎక్కువ సామాగ్రిని తమ వెంట తీసుకెళ్లాల్సి వస్తే ప్రయాణికులు అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. నటాలియా వద్ద నిర్దేశిత లగేజీ కంటే తొమ్మిదిన్నర కేజీల బరువు ఉన్న దుస్తులు ఉన్నాయి. దీనితో అక్కడి భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. అదనపు ఛార్జీలను చెల్లించాలని ఆదేశించారు. దీని విలువ 65 పౌండ్లు. ఆ సమయంలో ఆమె వద్ద 60 పౌండ్లు మాత్రమే ఉన్నాయి.

Mom dodges Thomas Cook baggage cost by carrying 4kg of clothes on the airplane

దీనితో ఆమెకు అదనపు ఛార్జీలను చెల్లించడానికి మనసు ఒప్పుకోలేదు. ఈ గండం నుంచి గట్టెక్కడానికి బుర్రకు పదును పెట్టింది. మెరుపులాంటి ఐడియా తోచింది. వెంటనే దాన్ని అమలు చేశారు. వాష్ రూమ్ కు వెళ్లి, అదనంగా తన వెంట దుస్తులను ధరించారు. తన వెంట బ్యాగులో తెచ్చుకున్న ఏడు డ్రెస్సులు, రెండు జతల బూట్లు, రెండు షర్టులు, ఒక స్కర్టు వేసుకున్నారు. బ్యాగుల బరువు తగ్గడంతో ఎయిర్ పోర్ట్ సిబ్బంది ఆమెను విమానం ఎక్కడానికి అనుమతి ఇచ్చారు.

విమానంలో కూర్చున్న తరువాత అసలు సీన్ స్టార్టయ్యింది. నాలుగు కేజీల బరువున్న దుస్తులు ఒంటిపై ధరించడంతో.. ఉక్కపోత వేయడం మొదలు పెట్టింది. ఏసీ ఉన్నప్పటికీ.. అది చాలలేదు. తల నుంచి అరికాళ్ల దాకా చెమటతో తడిచిపోయారు. ఇక భరించలేకపోయారామె. వెంటనే అక్కడి ఎయిర్ హోస్టెస్ ను పిలిచి.. తనకు బాగా ఉక్కపోతగా ఉందని, అదనంగా వేసుకున్న దుస్తులను విప్పేసి, దిగేటప్పుడు వేసుకుంటానని అడిగారు. దీనితో సిబ్బంది బిత్తరపోయారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A mother dodged Thomas Cook’s baggage charges on a flight by wearing 3kg worth of clothing – which included seven dresses and two pairs of shoes. Natalie Wynn, 30, from Oldham, Manchester, piled on the seven dresses, two pairs of shoes, two pairs of shorts, a skirt and a cardigan to avoid forking out the £65 fee when her case was 3.4kg over the 6kg limit. She was stopped while boarding the Thomas Cook flight when a security officer weighed her 9.4kg case and told her it was too heavy to be taken into the cabin.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more