ఆకాశంలో తూర్పు దిక్కున అద్భుతం ఆవిష్కృతం

వాషింగ్టన్: ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. అంతరిక్ష వీక్షకులను అబ్బురపరిచింది. ఎన్నో అంతుచిక్కని, అంతు లేని నిలయంగా మారిన అంతరిక్షంలో తాజాగా చోటు చేసుకున్న ఈ సదృశ్యం అత్యంత అరుదుగా సంభవిస్తుంటుంది. అదే.. చందమామ- శుక్రగ్రహాల కలయిక (Moon and Venus conjunction).

చంద్రుడు (Moon), శుక్రగ్రహం (Venus) అత్యంత సమీపానికి వచ్చాయి. ఈ తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఈ సెలెస్టియల్ కంజంక్షన్ ఏర్పడింది. సుమారు రెండున్నర నుంచి మూడు గంటల పాటు కొనసాగింది. తూర్పు- ఆగ్నేయ దిశలో కనువిందు చేసింది ఈ ఖగోళ సదృశ్యం.

Moon and Venus conjunction made eye feast for the stargazers

అమావాస్య సమీపిస్తోన్నందున.. చందమామ క్షీణిస్తూ వస్తోంది. పరిణామంలో 15 శాతం కంటే తక్కువగా కనిపించింది. కృష్ణపక్ష ఘడియలు ఎక్కువ రోజులు లేవు. ఈ నెల 12వ తేదీన అమావాస్య కావడం వల్ల చంద్రుడు క్షీణదశలో ఉన్నాడు. అదే సమయంలో ఈ కంజంక్షన్ ఏర్పడింది.

శుక్రగ్రహంతో కలిసి చంద్రుడు శుక్రుడి మీదుగా చందమామ తన ప్రయాణాన్ని సాగించడం వల్ల ఈ కంజంక్షన్ సంభవించింది. చంద్రుడికి కుడి వైపున పైభాగంలో మెరుస్తూ కనిపించింది వీనస్. యూరప్, పశ్చిమ రష్యా, గ్రీన్‌ల్యాండ్, ఆఫ్రికా, ఆసియా, స్వాల్‌బార్డ్‌లల్లో ఈ కంజంక్షన్ కనిపించింది.

చంద్రుడు- శుక్రగ్రహాలకు జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రత్యేకత ఉంది. కృష్ణపక్ష చంద్రుడితో కలిసి- శుక్రగ్రహం కనిపించడాన్ని అరుదుగా భావిస్తారు. గతంలో ఇలాంటి ఖగోళ సదృశ్యాలు సంభవించిన సందర్భాలు అరుదుగా చెబుతున్నారు. అమావాస్య సమీపిస్తోన్న రోజుల్లో శుక్రగ్రహంతో కలిసి చంద్రుడు కనిపించడాన్ని అశుభంగా పరిగణిస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+