అయ్యో.. ఎలాన్ మాస్క్.. సగం మంది ఫాలొవర్లు ఫేకేనట, స్పార్క్ టోరో లెక్క ఇదీ..

టెస్లా చీఫ్ ఎలాన్ మాస్క్ ఇటీవల ట్విట్టర్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు సంబంధించిన ఒక కొత్త విషయం వెలుగుచూసింది. మాస్క్ ట్విట్టర్ ఫాలొవర్స్ సగం మంది ఫేక్ అనే విషయాన్ని ఆన్ లైన్ ఆడిటింగ్ కంపెనీ స్పార్క్ టోరో తెలియజేసింది. మాస్క్ ఇటీవలలే 44 బిలియన్ డాలర్లకు సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కొనుగోలు చేశారు. ఆ వెంటనే ఆయనకు సంబంధించిన విషయం బయటకు వచ్చింది.

మాస్క్ 53.4 శాతం మంది ఫాలొవర్లు నకిలీ అని పేర్కొంది. ఇందులో స్పామ్ ఖాతాలు, బాట్ ఖాతాలు ఉండి ఉండొచ్చు అని అంచనా వేసింది. అదీ కాదంటే వారు ట్విట్టర్ ఖాతా చాలా రోజుల నుంచి వాడి ఉండరని తెలిపింది. మాస్క్‌కు 90 మిలియన్ల మంది ట్విట్టర్ ఫాలొవర్లు ఉన్నారు. వారిలో సగం మంది ఫేక్ విషయం సంచలనం రేపుతుంది. అయితే ఇదీ పూర్తిగా నిజం అయి ఉండదని వార్తా సంస్థ చెబుతుంది.

More Than Half Of Elon Musk Twitter followers Are Fake

మాస్క్ లక్ష ఖాతాల నుంచి 2 వేల ఖాతాలను తీసుకొని లెక్కగట్టారు. అందులో 25 రకాల అంశాలను పరిశీలించి చూశారు. చాలా మట్టుకు స్పామ్, బాట్, లో క్వాలిటీ అకౌంట్లు ఉన్నాయని పేర్కొన్నారు. 41 శాతం ఫాలొవర్లు అయితే కచ్చితంగా అబ్దదమేనని తెలిపింది. మాస్క్ ఖాతాల్లో నకిలీ అకౌంట్లు ఎక్కువగా ఉన్నాయని వివరించింది. ట్విట్టర్ ఖాతా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసే పనిలో మాస్క్ బిజీగా ఉన్నారు. ఆయన కూడా ఖాతాలో బాట్స్, స్పామ్ ఖాతాలు ఎక్కువగా ఉన్నాయని అంతకుముందు పేర్కొన్నారు. అయితే అతని ఫాలొవర్లు నకిలీవని తేలడం విస్మయానికి గురిచేస్తోంది.

మాస్క్ కంపెనీ టెస్లా గతవారం 8.5 బిలియన్ డాలర్ల షేర్లను విక్రయించిందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. అయితే యూఎస్ సెక్యూరిటీస్ మాత్రం 9.6 మిలియన్ షేర్లను విక్రయించిందని వివరించింది. మాస్క్ నికర ఆస్తుల విలువ 268 బిలియన్ డాలర్లు అని ఫోర్బ్స్ లెక్కగట్టింది. కానీ ట్విట్టర్ ఫాలొవర్లు సగం మంది ఫేక్ అనే వార్త మాత్రం హల్ చల్ చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+