సమాధులవద్ద ఉచిత వైఫై సదుపాయం.. ఎందుకంటే?
మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో అధికారుల కొత్తగా ఆలోచించారు. మాస్కో నగరంలో ప్రజలు సమూహాలుగా సంచరించే ప్రాంతాలలో ఉచిత వైఫై సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నగరంలో ఉన్న మూడు ప్రధాన శ్మశాన వాటికల వద్ద కూడా వచ్చే ఏడాది నుంచి ఉచిత వైఫై సదుపాయం కల్పించనున్నారు.
ఈ శ్మశానాలు చారిత్రక ప్రాధాన్యం కలిగినవని, పలువురు రష్యన్ వీరుల సమాధులు ఇక్కడ ఉన్నాయని చెప్పారు. ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం వల్ల అక్కడకు సందర్శకులు ఎక్కువగా వచ్చే అవకాశముంటుందని చెప్పారు.

శ్మశానాల వద్ద సందర్శకులు సేద తీరేందుకు ఏర్పాటు చేసే ప్రత్యేక ప్రాంతంలో ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈ ప్రకటనను గురువారం నాడు అధికారులు చేశారు. శ్మశాన వాటికల వద్ద వైఫై సౌకర్యం కల్పిస్తామని చెప్పడం గమనార్హం.












Click it and Unblock the Notifications